Telangana: ఆ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఎందుకు తాళం పడింది..? కారణం అదేనా..?

ఆ MLA రూటే సపరేటు.. ఎవరేమనుకుంటే నాకేంటి..! నేనింతే అంటున్నట్లు వ్యవహరించే ఆ MLA ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో హాట్ టాపిక్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అంతా వారి నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయం స్వాధీనం చేసుకున్నారు.

Telangana: ఆ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఎందుకు తాళం పడింది..? కారణం అదేనా..?
Narsampet Mla Camp Office
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 02, 2024 | 6:47 PM

ఆ MLA రూటే సపరేటు.. ఎవరేమనుకుంటే నాకేంటి..! నేనింతే అంటున్నట్లు వ్యవహరించే ఆ MLA ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో హాట్ టాపిక్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అంతా వారి నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయం స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఆ క్యాంప్ కార్యాలయంలో కుటుంబ సమేతంగా నివాసం ఉంటుంటే, మరికొందరు మాత్రం అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు నిత్యం క్యాంపు కార్యాలయంలోనే అందుబాటులో ఉంటున్నారు.

కానీ వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం నర్సంపేట లోని MLA క్యాంపు కార్యాలయంలో ఇప్పటి వరకు అడుగు పెట్ట లేదు. ఇందులో ఉండడానికి పూర్తి విముఖత చూపారు. గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా క్యాంపు కార్యాలయంలో అడుగు పెట్టక పోవడంతో తాళాలు వేలాడుతున్నాయి. ఆ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఎందుకు తాళం పడింది..? వాస్తు దోషమే కారణమా…? ఆ మాజీ MLA ఓటమికి క్యాంపు కార్యాలయం వాస్తు దోషమే గండమైందా..? తాజా MLA అందులో అడుగు పెట్టక పోవడం వెనుక అసలు సీక్రెట్ ఏంటి..? అన్నదీ జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన రోజు రాత్రే ఈ క్యాంపు కార్యాలయాన్ని ఖాళీచేసి వెళ్ళి పోయారు.. ప్రస్తుతం తన నివాసంలోనే ఉంటున్నారు. ఈ నియోజకవర్గం నుండి రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం నేనింతే అంటున్నట్లు వ్యవహరించడం చర్చగా మారింది. ఈ మధ్య దొంతి మాధవరెడ్డి ఏం చేసినా సంచలనమే అవుతుంది. ఏ నిర్ణయం తీసుకున్న జనంలో చర్చకు దారి తీస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి తన క్యాంపు కార్యాలయంలో అడుగు పెట్టకపోవడంతో ఆర్ అండ్ బీ అధికారులు దానికి తాళాలు వేశారు.

నర్సంపేట పట్టణంలో బస్టాండ్ సమీపంలో ఉన్న పాత భవనం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌ను తన క్యాంపు ఆఫీస్ గా మార్చారు. ఇక్కడి నుండే పాలన వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. పాత MLA క్యాంపు కార్యాలయాన్ని ఆర్ అండ్ బీ అతిథి గృహంగా మార్చబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలలోని క్యాంప్ కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ దొంతి మాధవరెడ్డి మాత్రమే అందులో అడుగు పెట్టకపోవడం వెనక అసలు రహస్యం వాస్తు దోషమే అని ప్రచారం జరుగుతోంది. వాస్తు నిపుణుల సూచన మేరకే అందులో అడుగు పెట్టడం లేదని జనం నోట గుస గుసలు వినిపిస్తున్నాయి.

పాత ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ కు రంగులేసి తన క్యాంపు కార్యాలయంగా తీర్చిదిద్దుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మోడల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎందుకు ఉపయోగించడం లేదనేది మాత్రం ఇప్పుడు జనంలో అటు.. ప్రభుత్వంలోనూ ఆసక్తికర చర్చకు దారి తీసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..