
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌కు ఇచ్చిన ‘క్రాస్‌ఫైర్’ ఇంటర్వ్యూలో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టారు. రాజకీయాల్లో తన తదుపరి లక్ష్యం, సీఎం కుర్చీపై ఆశల గురించి వస్తున్న ప్రచారాలను ఆయన సున్నితంగా తిప్పికొట్టారు.
మంత్రివర్గంలో స్థానాలపై స్పందిస్తూ, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనేది సీఎం, హైకమాండ్ ఇష్టమని స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్‌లో నెంబర్ 2 స్థానం డిప్యూటీ సీఎందేనని, తమ కేబినెట్‌లో డమ్మీలు ఎవరూ లేరని, ప్రతి మంత్రికి వారి శాఖల్లో పూర్తి పవర్స్ ఉన్నాయని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగారనే వార్తల్లో నిజం లేదని, ఎమ్మెల్యేల అలకలు కుటుంబసభ్యుల గొడవ లాంటివని కొట్టిపారేశారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పొంగులేటి తీవ్ర విమర్శలు చేశారు. “అప్పట్లో మాయమాటలు నమ్మి బీఆర్‌ఎస్‌లో చేరాను. కానీ అక్కడ నాకు నిత్యం అవమానాలు, అవహేళనలు జరిగాయి. చివరికి టికెట్ ఇవ్వకుండా తడిబట్టతో గొంతుకోశారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నాడు శపథం చేశానని, తాను ఎవరికీ చప్పట్లు, డప్పులు కొట్టే వ్యక్తిని కాదని తేల్చిచెప్పారు. అలాగే, ప్రజలకు చేయలేని పని ఏదైనా ఉంటే మొహం మీదే చేయలేను అని చెప్తానని, కాంగ్రెస్‌లో తాను ఎలాంటి ప్రత్యేక వర్గాన్ని తయారుచేసుకోవడం లేదని పొంగులేటి ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..