Weather Forecast: బీ అలర్ట్.. తెలంగాణపై వరుణ ప్రతాపం.. ఈ జిల్లాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు..!

|

Apr 26, 2023 | 9:05 AM

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కూడా వర్షాలు పడే వీలుంది. పశ్చిమ విదర్భ నుండి మరాట్వాడా మీదుగా దక్షిణ కర్ణాటక వరకు వ్యాపించిన ఉపరితల ఆవర్తనంతో జోరుగా వర్షాలు పడుతున్నాయి. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

Weather Forecast: బీ అలర్ట్.. తెలంగాణపై వరుణ ప్రతాపం.. ఈ జిల్లాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు..!
TS Rains
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కూడా వర్షాలు పడే వీలుంది. పశ్చిమ విదర్భ నుండి మరాట్వాడా మీదుగా దక్షిణ కర్ణాటక వరకు వ్యాపించిన ఉపరితల ఆవర్తనంతో జోరుగా వర్షాలు పడుతున్నాయి. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

తెలంగాణలో బుధ, గురువారాల్లో వర్షాలు..

ఉపరిత ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. నేడు తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, జనగాం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సదరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇక రాబోయే 3 గంటల్లో హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మేడ్చల్ గద్వాల్, వనపర్తి జిల్లాల్లో వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

అప్రమత్తంగా ఉండండి..

కాగా, మరోసారి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..