Telangana Rain Alert: తెలంగాణ వాసులకు హెచ్చరిక.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. మరో 3 రోజులు వానలే వానలు

|

Jul 12, 2022 | 8:55 AM

సోమవారం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర.. పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం నేడు ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళఖాతంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం మరింత బలపడనున్నదని వాతావరణ శాఖా అంచనావేస్తోంది.

Telangana Rain Alert: తెలంగాణ వాసులకు హెచ్చరిక.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. మరో 3 రోజులు వానలే వానలు
Ts Rians Alert
Follow us on

Rain Alert in Telangana: గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. జనజీవనం స్తంభించింది. అయితే రాష్ట్రాన్ని వరుణుడు అప్పుడే వీడనంటున్నాడు.. హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని.. హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలు రాబోయే 4-5 రోజులలో మిగిలిన ప్రాంతాలను ముంచెత్తుతాయి. సోమవారం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర.. పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం నేడు ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళఖాతంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం మరింత బలపడనున్నదని వాతావరణ శాఖా అంచనావేస్తోంది.

pic.twitter.com/RpknR7CnAu

ఇవి కూడా చదవండి

మరోవైపు రుతుపవనాలు ద్రోణి జైసల్మేర్‌, కోట, పెండ్రా రోడ్, బలంగిర్‌, అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీంతో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నేడు, రేపు పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రభుత్వం , అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

సూర్యాపేట, సిద్ధిపేట, నల్గొండ ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ను, హైదరాబాద్ కు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది.  గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. నగరంలో అనేక రహదారులు వరదలకు గురై ట్రాఫిక్ అంతరాయాలకు దారితీశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని అనేక రిజర్వాయర్‌లు జలకళను సంతరించుకున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఒసామాన్‌సాగర్,  హిమాయత్‌సాగర్ రిజర్వాయర్‌ల నుండి అదనపు నీటిని విడుదల చేయడానికి వరదగేట్లను ఎత్తివేయవలసి వచ్చింది. గత నాలుగురోజులుగా ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణాలో కూడా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరికి వరద పోటెత్తింది.  గోదారమ్మ ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది. గోదావరినది పరివాహక ప్రాంతాలు జలమయం అయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..