Watch Video: మోస్ట్‌ వాంటెడ్‌ రౌడీషీటర్ సురేందర్ అరెస్ట్.. దర్యాప్తులో సంచలనాలు

Warangal rowdy sheeter Surender arrested: మోస్ట్‌ వాంటెడ్‌ రౌడీషీటర్ సురేందర్ అలియాస్ సూరి పోలీసులకు చిక్కాడు. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్న సూరిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌తో సహా 5 జిల్లాల్లో రౌడీషీటర్ సురేందర్ అలియాస్ సూరి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సూరి పోలీసులకు తెలిపాడు..

Watch Video: మోస్ట్‌ వాంటెడ్‌ రౌడీషీటర్ సురేందర్ అరెస్ట్.. దర్యాప్తులో సంచలనాలు
Warangal Rowdy Sheeter Surender

Updated on: Nov 04, 2025 | 12:07 PM

వరంగల్, నవంబర్ 4: మోస్ట్‌ వాంటెడ్‌ రౌడీషీటర్ సురేందర్ అలియాస్ సూరి పోలీసులకు చిక్కాడు. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్న సూరిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌తో సహా 5 జిల్లాల్లో రౌడీషీటర్ సురేందర్ అలియాస్ సూరి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సూరి పోలీసులకు తెలిపాడు. సూరి గ్యాంగ్ పై ఇప్పటివరకు పలు పోలీస్‌ స్టేషన్లలో 40 కేసుల వరకు నమోదైనాయి. రాచకొండ కమిషనరేట్ పోలీసులు నగర బహిష్కరణ చేయడంతో వరంగల్ ను అడ్డాగా మార్చుకున్న రౌడీషీటర్ సూరి.. తుపాకులతో బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నాడు.

మోయిన్, మునీర్, సూరిగా చలామని అవుతున్న రౌడీషీటర్ దాసరి సురేందర్.. తాజాగా హనుమకొండ జిల్లా శాయంపేటలో కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ టీమ్ పోలీసులు నలుగురు ముఠాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ముఠా నుంచి రెండు వెపన్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గ్యాంగ్ స్టర్ సురేందర్ స్వగ్రామం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామం. గతంలో హైదరాబాద్ లో కారు డ్రైవర్ గా పనిచేస్తూ గ్యాంగ్ స్టర్ గా మారిన సూరి.. పలు నేరాల్లో నిందితుడుగా ఉన్నాడు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.