AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పీజీ డాక్టర్.. ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టాడు.. సీన్ కట్ చేస్తే..

హైదరాబాద్ నగరంలోని ఓ డాక్టర్ ఇంట్లో పోలీసులు డ్రగ్స్‌ పట్టుకోవడం కలకలం రేపింది. డ్రగ్స్ వ్యాపారానికి తెరతీసిన డాక్టర్‌ .. స్నేహితులతో కలిసి ఇంట్లో నుంచే అమ్మకాలు జరుపుతున్నాడు.. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎక్సైజ్ STF పోలీసులు.. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 15 గ్రాముల LSD బోల్ట్‌, 1.32 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Hyderabad: పీజీ డాక్టర్.. ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టాడు.. సీన్ కట్ చేస్తే..
Doctor Arrest
Shaik Madar Saheb
|

Updated on: Nov 04, 2025 | 12:12 PM

Share

హైదరాబాద్ నగరంలోని ఓ డాక్టర్ ఇంట్లో పోలీసులు డ్రగ్స్‌ పట్టుకోవడం కలకలం రేపింది. డ్రగ్స్ వ్యాపారానికి తెరతీసిన డాక్టర్‌ .. స్నేహితులతో కలిసి ఇంట్లో నుంచే అమ్మకాలు జరుపుతున్నాడు.. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎక్సైజ్ STF పోలీసులు.. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 15 గ్రాముల LSD బోల్ట్‌, 1.32 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌లో అద్దెకు ఉంటున్న జాన్‌పాల్‌ అనే వైద్యుడు.. ఇంట్లోనే డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్ STF పోలీసులు .. అక్కడికి చేరుకుని.. అతని నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.3 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు తెలిపారు. జాన్‌పాల్‌ను అరెస్టు చేసి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్‌, సందీప్‌, శరత్‌.. ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తెప్పించి వైద్యుడు జాన్‌పాల్‌ ఇంట్లో ఉంచి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ విక్రయించినందుకు గాను వైద్యుడికి వీటిని ఉచితంగా ఇస్తున్నారని.. దీంతో పీజీ వైద్యుడు డ్రగ్స్‌కు బానిస అయ్యాడని తెలిపారు. అతడి ఇంట్లో ఓజీకుష్‌, ఎండీఎంఏ, కొకైన్‌, హాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని.. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్