Telangana: నారింజ పండ్లతో వెళ్తున్న లారీ బోల్తా.. పండ్ల కోసం ఎగబడ్డ జనం

|

Jan 03, 2024 | 12:21 PM

ఆదిలాబాద్‌ కుప్టిలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి బోల్తా పడిపోయింది. నారింజ పండ్లతో వెళ్తున్న లారీ బోల్తాపడటంతో పండ్లన్నీ రోడ్డుపై పడిపోయాయి. గమనించిన స్థానికులు పరుగు పరుగున వచ్చారు. రోడ్డుపై పడిపోయిన నారింజ పండ్లను తీసుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. సంచులు, గోతాంలు తీసుకొచ్చి పండ్లను నింపుకుని తీసుకెళ్లారు. లారీ బోల్తా పడటంతో..

హైదరాబాద్‌, జనవరి 3: ఆదిలాబాద్‌ కుప్టిలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి బోల్తా పడిపోయింది. నారింజ పండ్లతో వెళ్తున్న లారీ బోల్తాపడటంతో పండ్లన్నీ రోడ్డుపై పడిపోయాయి. గమనించిన స్థానికులు పరుగు పరుగున వచ్చారు. రోడ్డుపై పడిపోయిన నారింజ పండ్లను తీసుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. సంచులు, గోతాంలు తీసుకొచ్చి పండ్లను నింపుకుని తీసుకెళ్లారు. లారీ బోల్తా పడటంతో పండ్లన్ని ఇలా రోడ్డు పాలయ్యాయి. నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కాగా గతంలోనూ పలుచోట్ల మద్యం, టమాటా, కూల్ డ్రింక్స్, చేపలు, కూరగాయలు.. ఇలా లోడ్ తీసుకెళ్తున్న ట్రక్కులు కూడా బోల్తా పడగా.. స్థానికులు ఎత్తుకెళ్లిన ఘటనలు కోకొల్లలున్నాయి. గతంలో టమాట రేట్లు పెరిగిన సమయంలో పలుచోట్ల ట్రక్కులు ప్రమాదానికి గురవ్వగా లక్షల విలువ చేసే పంటను పాదచారులు, స్థానికులు, ఇతర వాహనదారులు సంచుల్లో ఎత్తుకెళ్లారు. దీంతో ఏం చేయాలో పాలుపోక రైతులు నెత్తీనోరు కొట్టుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బాదితులకు సాయం చేయడానికి బదులు ఇలా దోచుకోవడం బాధాకరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.