Liquor Sales: మందు బాబులా మజాకా.. గతేడాది తెలంగాణలో ఎంత తాగారో తెలిస్తే..
రాష్ట్రంలో అత్యధికంగా మద్యం అమ్ముడు పోయిన జిల్లాల్లో రూ. 8,899.44 కోట్లతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇక హైదరాబాద్‌లో రూ.3758.46 కోట్లు, వరంగల్‌లో రూ.3,549.41 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఏడాదికేడాది మద్యం అమ్మకాలు జోరందుకుంటున్నాయి...

గతేడాది తెలంగాణలో మద్మం అమ్మకాలు ఓ రేంజ్‌లో జరిగాయి. ఎంతలా ఉంటే 2023లో ఏకంగా రూ. 36,151 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. 3.58 కోట్లకు కేసులకు పైగా లిక్కర్, 5.34 కోట్ల కేసులకు పైగా బీర్‌ను తాగేశారు. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది రూ. 2 వేల కోట్లు అదనం కావడం గమనార్హం. తెలంగాణ వ్యాప్తంగా అన్న జిల్లాల్లో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయని గణంకాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో అత్యధికంగా మద్యం అమ్ముడు పోయిన జిల్లాల్లో రూ. 8,899.44 కోట్లతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇక హైదరాబాద్‌లో రూ.3758.46 కోట్లు, వరంగల్‌లో రూ.3,549.41 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఏడాదికేడాది మద్యం అమ్మకాలు జోరందుకుంటున్నాయి.
ఇక గతేడాది జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో రూ. మూడు వేల కోట్ల కంటే తక్కువ విలువైన మద్యం అమ్మకాలు జరగగా, మిగిలిన 5 నెలల్లో మూడు వేల కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో కూడా మద్యం ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఒక్క నెలలోనే ఏకంగా రూ.4297 కోట్ల విలువైన 43.60 లక్షల కేసులు లిక్కర్, 46.22లక్షల కేసులు బీరు విక్రయాలు జరిగాయి. ఇక డిసెంబర్ నెలో 28వ తేదీ నుంచి 31వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే రూ. 777 కోట్లు విలువైన అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాల వారీగా తీసుకుంటే.. రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
