Gruha Lakshmi Scheme: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. గృహలక్ష్మి పథకం రద్దు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు..

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో సొంత స్థలం ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.

Gruha Lakshmi Scheme: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. గృహలక్ష్మి పథకం రద్దు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు..
Revanth Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 03, 2024 | 8:36 AM

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో సొంత స్థలం ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులకు ఇచ్చిన మంజూరు పత్రాలను సైతం రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సొంత జాగా ఉన్నవారికి అభయహస్తం ఆరుగ్యారెంటీల్లో భాగంగా ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకునే వారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలి తొలగింపు..

ఇదిలాఉంటే.. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు శ్రీదేవిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెకు కేటాయించిన ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులను సైతం తొలగించింది. ఆమె వద్ద డిప్యుటేషన్‌పై పీఎస్‌, పీఏ, ఓఎస్డీలుగా విధుల్లో చేరినవారు వెంటనే తమ సంబంధిత శాఖల్లో చేరాలని ఆదేశించింది. అంతేకాకుండా.. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, రెవెన్యూశాఖ అదనపు కార్యదర్శి మాధవరం నరేందర్‌రావును సైతం రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను రాష్ట్ర ఆహార కమిషన్‌ మెంబర్‌ సెక్రెటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడున్న సంయుక్త కార్యదర్శి మనోహర్‌ను సచివాలయంలోని జీఏడీలో చేరాలని తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..