Anganwadi worker death : వరంగల్‌లో ఓ అంగన్‌వాడీ వర్కర్ మృతి కలకలం రేపింది. హంటర్ రోడ్డులోని న్యూశాయంపేటలో నివాసం ఉండే వనిత గుండెపోటుతో ఈ ఉదయం మృతి చెందారు. ఆమె చనిపోయింది గుండెపోటుతో అయినా… మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వనిత ఈనెల 19న కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ వికటించడం వల్లే వనిత మరణించి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తోటి వర్కర్స్ మాత్రం కుటుంబ సభ్యుల ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. తాము కూడా టీకా వేయిచుకున్నామని… ఎలాంటి సమస్యలు లేవంటున్నారు. ముందు రోజే చెస్ట్ పెయిన్ వచ్చిందని… అది హార్ట్ అటాక్ అని అప్పుడే గుర్తించి హస్పిటల్‌కు వెళ్లుంటే ప్రమాదం తప్పేదన్నారు. కుటుంబ సభ్యులు బలవంతం చేసినా ఆమె ఆసుపత్రికి వెళ్లలేదన్నారు.
పోస్టుమార్టం తర్వాత వనిత మృతిపై పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. హెల్త్ కేర్ వర్కర్ మృతిపై వైద్యశాఖ స్పందించింది. ఫుల్ రిపోర్టు పంపించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది. స్పందించిన AEFI… రిపోర్టు రెడీ చేస్తోంది. ఈ టీం రాష్ట్ర టీంకు నివేదిక సబ్‌మీట్ చేయనున్నారు. అనంతరం ఆ నివేదికను కేంద్రానికి పంపించనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also.. ఆయోధ్య రామ మందిర నిర్మాణాకి కదిలిన పాతబస్తీ.. విరాళాలు సేకరించిన ముస్లిం మహిళలు