AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసులకే షాక్ ఇచ్చిన కేటుగాళ్లు… పోలీస్‌స్టేషన్‌ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

పోలీసులకే షాకిచ్చారు సైబర్ నేరగాళ్లు..ఏకంగా పోలీస్‌స్టేషన్‌ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేశారు. పలువురు వ్యక్తులకు దీని ద్వారా మెసేజ్‌లు చేసి గూగుల్‌, ఫోన్‌పే యాప్‌ ద్వారా డబ్బులు

పోలీసులకే షాక్ ఇచ్చిన కేటుగాళ్లు... పోలీస్‌స్టేషన్‌ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు
Cyber Criminals
Rajeev Rayala
|

Updated on: Mar 31, 2021 | 9:25 PM

Share

పోలీసులకే షాకిచ్చారు సైబర్ నేరగాళ్లు..ఏకంగా పోలీస్‌స్టేషన్‌ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేశారు. పలువురు వ్యక్తులకు దీని ద్వారా మెసేజ్‌లు చేసి గూగుల్‌, ఫోన్‌పే యాప్‌ ద్వారా డబ్బులు పంపించాలని కోరారు. టెక్నాలజీని వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పోలీసులు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే వరంగల్ జిల్లాలో ఏడాదిన్నర క్రితం వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లోని దామెర పీఎస్ పేరుతో ఓ పోలీసు అధికారి ఫేస్‌బుక్‌ అకౌంట్ తెరిచారు. ఇటీవల పోలీసులు అధికారికంగా మరో ఫేస్‌బుక్‌ అకౌంట్ ప్రారంభించడంతో పాత అకౌంట్‌ను వాడటం పక్కనపెట్టేశారు. దానిపై కన్నేసిన సైబర్‌ నేరగాళ్లు దామెర ఠాణాకు సంబంధించిన పాత ఫేస్‌బుక్‌ ఖాతాను హ్యాక్‌ చేశారు. దానినుంచి పలువురు వ్యక్తులకు దీని ద్వారా మెసేజ్‌లు చేసి గూగుల్‌, ఫోన్‌ పే యాప్‌ ద్వారా డబ్బులను పంపించాలని కోరారు.

దీనిపై అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు దామెర ఎస్సై భాస్కర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన కమిషనరేట్‌లోని సైబర్‌ క్రైమ్ విభాగం పాత ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేశారు. అయితే ఇప్పటివరకు వరకు ఎవరూ డబ్బులు పంపించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.ఫేస్‌బుక్‌ చేసిన ముఠా మధ్యప్రదేశ్‌కు చెందిన వారి పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా డబ్బుల లావాదేవీలు ఉండవని కేవలం సమాచారం, ఫిర్యాదులు చేసేందుకు పోలీసులు వాటిని వినియోగిస్తుంటారని దామెర ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?