AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భ్రమపడింది.. కానీ, భర్త ప్రాణం పోయింది.. రైల్వే ట్రాక్‌పై భార్యతో వీడియో కాల్‌‌లో మాట్లాడుతూ..

వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో రైలు పట్టాలపై నిలబడి భార్యకు వీడియో కాల్ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం మత్తులో బెదిరిస్తున్నాడని భావించిన భార్య విషయాన్ని తేలిగ్గా తీసుకోగా, మరుసటి ఉదయం అతని మృతదేహం రైల్వే పట్టాలపై లభ్యమైంది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భ్రమపడింది.. కానీ, భర్త ప్రాణం పోయింది.. రైల్వే ట్రాక్‌పై భార్యతో వీడియో కాల్‌‌లో మాట్లాడుతూ..
Kazipet Railway Track Suicide
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jul 07, 2026 | 7:27 AM

Share

రైలు పట్టాల మీద నిలబడి ఎదురుగా వస్తున్న రైలును వీడియో కాల్ లో భార్యకు చూపిస్తూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. బార్యభర్తల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న కలహాలే ఈ విషాద సంఘటనకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు.. అయితే.. తన భర్త మద్యం మత్తులో బెదిరిస్తున్నాడని భ్రమపడిన లైట్ తీసుకున్న భార్య ఇప్పుడు బోరున విలపిస్తుంది. ఈ విషాద సంఘటన హనుమకొండ కాజీపేట దర్గా సమీపంలోని తొమ్మిది మోరీల వద్ద జరిగింది.. ప్రకాష్ రెడ్డి ప్రాంతానికి చెందిన లావుడ్యా రాజేశ్‌నాయక్‌ (45) అనేవ్యక్తి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా రాజేష్ నాయక్ తన భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య అతని తల్లిదండ్రుల మధ్య ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.. ఈ క్రమంలో రాజేష్ ఆదివారం రాత్రి భార్యతో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు.

సరిగ్గా రాత్రి 10:30 నిమిషాల సమయంలో రైలు పట్టాల మీద నిలబడి భార్యకు వీడియో కాల్ చేశాడు.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు.. అయితే, రాజేష్ మద్యం మత్తులో బెదిరిస్తున్నాడని విషయాన్ని తేలిగ్గా తీసుకుంది. రాత్రంతా ఇంటికి రాలేదు.. భార్య, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న క్రమంలో అతని మరణ వార్త తెలిసింది.. ఉదయం 6 గంటలకు రైలు పట్టాల మీద రాజేష్ మృతదేహం గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

రాజేష్ నాయక్ బలవన్మరణంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. చిన్న చిన్న మనస్పర్థలతో ప్రాణాలు తీసుకోవడం ద్వారా కుటుంబం రోడ్డున పడుతుంది.. కావున, పరిష్కారం కోసం ఆలోచించడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us