
Warangal, September 06: దోపిడీ దొంగలు వరంగల్ ప్రజలకు- పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.. అపార్ట్‌మెంట్సే వారి టార్గెట్.. ఖరీదైన కారులో క్లాస్ గా వచ్చి లూటీలకు పాల్పడుతున్నారు.. ఈ దోపిడీలు పట్టపగలే జరగడం విశేషం. వరంగల్ – హనుమకొండ పట్టణాల్లో లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు అపార్ట్‌మెంట్లలో అచ్చం సినీ ఫక్కీలో దోపిడీలకు పాల్పడ్డారు. అడ్డదారిలు కాదు.. నేరుగా కారులో వచ్చి క్లాస్ గా దోసుకుపోయారు. అపార్ట్‌మెంట్లలో తాళాలు పగలగొట్టి లూటిలో పాల్పడ్డారు. ఇదంతా పోలీస్ అధికారులు క్రైమ్ మీటింగ్‌లో వున్న సమయంలో పట్టపగలే జరుగడం విశేషం.
వరంగల్ సిటీలో పట్టపగలు జరిగిన ఈ లూటీలు చూస్తే ప్రతి ఒక్కరు షాక్ వాల్సిందే. క్లాస్ గా ఖరీదైన కార్లు వచ్చిన దోపిడి దొంగలు దర్జాగా అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారు. వారికి ఏదో గిఫ్ట్ ఆఫర్ వచ్చిందని వాచ్ మెన్‌ను నమ్మించి లోపలికి వెళ్లారు. తాళాలు వేసి వెళ్ళిన ఫ్లాట్లను సెలెక్ట్ చేసుకుని మరి తాళాలు పగలగొట్టి ఆ ఇళ్లలోని బంగారం, విలువైన వస్తువులు నగదు లూటీలకు పాల్పడ్డారు.
ఒకటో రెండో కాదు.. ఏకంగా ఆరు ఆపార్ట్‌మెంట్లలో దోపిడీలు జరిగాయి. సుమారు 170 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, భారీ ఎత్తున నగదు విలువైన వస్తువులు, దోపిడీకి గురైనట్లుగా గుర్తించారు.. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ లోని గాయత్రి రెసిడెన్సీ, వద్దిరాజు రెసిడెన్సీలో చోరీ జరిగింది. హనుమకొండ నయీమ్ నగర్ ప్రాంతంలోని కల్లెడ అపార్ట్మెంట్, లహరి అపార్ట్ మెంట్, మారుతి అపార్ట్ మెంట్ తో పాటు మరో అపార్ట్ మెంట్ లో దోపిడిలు జరిగాయి. ఈ ముఠా అచ్చం సినీ ఫక్కీలో దోపిడిలకు పాల్పడ్డారు.. పట్టుకోండి చూద్దాం అన్నట్లు పోలీసులకు సవాల్ విసిరారు. ఈ లూటీ జరిగిన తీరుచూసి పోలీసులే షాక్ అయ్యారు. నిందితుల ఉపయోగించిన కారు ఆధారంగా ఈ ముఠా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎక్స్‌పర్ట్స్‌గా భావిస్తున్నారు.
పోలీస్ కమీషనర్ ఏ వీ రంగనాథ్ దొంగలను పట్టుకోవడం కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను రంగలోకి దింపారు.. ఇప్పటివరకు వారి ఆచూకీ లభ్యం కాలేదు.. వరంగల్ కు వచ్చి వెళ్లే అన్ని రూట్లలో సీసీ కెమెరా ఫుటేజ్, టోల్ గేట్ లు పరిశీలిస్తున్నారు.. వారు ఏ రూట్లో వచ్చారు..? ఎటు వెళ్లారని విచారణ జరుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..