Mulugu District: మేడారం వెళ్లే మార్గంలో వింత ఆకారాలు..! అసలు మ్యాటర్‌ తెలిస్తే..

అప్పట్లో తాడ్వాయి మండలంలోని కామారం అటవీ ప్రాంతంలో ఓ పెద్ద పులి పశువుల మందపై దాడికి ప్రయత్నించింది. ఆ తరువాత మంగపేట మండలంలో ఓ లేగ దూడపై దాడి చేసి, చంపేసింది. కొద్ది రోజులకు మంగపేట మండలంలోని శ్రీరాంనగర్ గొత్తికోయ గూడెం సమీపంలో మేత కోసం వెళ్లి ఆవుల మందపై కూడా పెద్ద పులి దాడికి దిగింది. ఈ దాడిలో ఓ లేగ దూడ మృత్యు వాత పడింది.

Mulugu District: మేడారం వెళ్లే మార్గంలో వింత ఆకారాలు..! అసలు మ్యాటర్‌ తెలిస్తే..
Tiger

Updated on: Apr 13, 2025 | 11:09 AM

ములుగు జిల్లాలో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మేడారం పరిసర అడవుల్లో పెద్ద పులి పాదముద్రలు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పులి అడుగులు గుర్తించారు. పులి పాద ముద్రలు అనుసరించి మేడారం, బయ్యక్కపేట అడవుల్లో పులిజాడ కోసం వెతుకుతున్నారు అటవీశాఖ అధికారులు. మహదేవ్ పూర్ మండలం గొత్తికోయగూడెంలో ఆవును చంపి మేడారం వైపు వచ్చినట్టుగా భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. అడవిలోకి ఎవరూ ఒంటరిగా వెళ్లకూడదని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. పులి ఆనవాళ్ళు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు.

గతంలో కూడా ములుగు జిల్లాలోని ములుగు, తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో పెద్దపులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి.. అప్పట్లో తాడ్వాయి మండలంలోని కామారం అటవీ ప్రాంతంలో ఓ పెద్ద పులి పశువుల మందపై దాడికి ప్రయత్నించింది. ఆ తరువాత మంగపేట మండలంలో ఓ లేగ దూడపై దాడి చేసి, చంపేసింది. కొద్ది రోజులకు మంగపేట మండలంలోని శ్రీరాంనగర్ గొత్తికోయ గూడెం సమీపంలో మేత కోసం వెళ్లి ఆవుల మందపై కూడా పెద్ద పులి దాడికి దిగింది. ఈ దాడిలో ఓ లేగ దూడ మృత్యు వాత పడింది.

Mulugu Tiger

పులి కదలికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మరియు సమీప గ్రామాల నివాసితులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పశువులను మేపడానికి ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని అటవీ అధికారులు గ్రామస్తులను హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..