Cyber Thieves: ఏకంగా పోలీస్ స్టేషన్‌కే ఎసరు పెట్టిన సైబర్ నేరగాళ్లు.. ఆ అకౌంట్‌ను హ్యాక్ చేసి.. పలువురు వ్యక్తులకు..

|

Mar 30, 2021 | 12:57 PM

Cyber Thieves: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఇప్పటి వరకు పోలీసులను మాత్రమే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ కేటుగాళ్లు..

Cyber Thieves: ఏకంగా పోలీస్ స్టేషన్‌కే ఎసరు పెట్టిన సైబర్ నేరగాళ్లు.. ఆ అకౌంట్‌ను హ్యాక్ చేసి.. పలువురు వ్యక్తులకు..
Cyber Crime
Follow us on

Cyber Thieves: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఇప్పటి వరకు పోలీసులను మాత్రమే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ కేటుగాళ్లు.. ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్‌కే ఎసరు పెట్టారు. పీఎస్ ఫేస్‌బుక్ ఖాతాను హ్యాక్ చేసి డబ్బులు పంపించాలంటూ ప్రజలను కోరారు. వరంగల్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లోని దామెర పీఎస్ పేరుతో ఓ ఫేస్‌బుక్‌ అకౌంట్ తెరిచారు. ఇటీవల పోలీసులు అధికారికంగా మరో ఫేస్‌బుక్‌ అకౌంట్ ప్రారంభించడంతో పాత అకౌంట్‌ మరుగున పడిపోయింది. దాన్ని పసిగట్టిన మాయగాళ్లు.. రెండు రోజుల క్రితం పాత ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. అనంతరం ఆ ఫేస్‌బుక్‌ ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్న వారికి మెసేజ్‌లు పంపడం స్టార్ట్ చేశారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించాలంటూ కోరారు.

అయితే, అలా మెసేజ్‌లు అందుకున్న కొందరికి ఇది పాత అకౌంట్ అని తెలుసు. ఈ నేపథ్యంలోనే అనుమానం వచ్చి దామెర ఎస్సై భాస్కర్ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే అలర్ట్ అయిన ఆయన.. కమిషనరేట్‌ పరిధిలోని సైబర్ క్రైమ్ విభాగానికి ఇన్‌ఫర్మేషన్ ఇచ్చారు. అలా పాత ఫేస్‌బుక్ అకౌంట్‌ను బ్లాక్ చేయించారు. ఇదే విషయాన్ని ప్రజలకూ పోలీసులు తెలిపారు. దామెర పీఎస్ పేరుతో ఫేస్‌బుక్‌లో ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వొద్దంటూ సూచించారు. ఫేస్‌బుక్ ద్వారా కేవలం ఫిర్యాదులు, సమాచారం వంటివి మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, హ్యాకింగ్‌కు గురైన ఫేస్‌బుక్‌ను బ్లాక్ చేసిన పోలీసులు.. ఈ హ్యాకింగ్‌కు పాల్పడిన ముఠాను పట్టుకునే పనిలో పడ్డారు. మధ్య ప్రదేశ్‌కు చెందిన ముఠా ఈ చర్యకు పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.

Also read:

Currency Bundles : పొద్దున్నే పారిశుధ్య కార్మికులకు షాక్ ఇచ్చిన డబ్బులు.. చెత్త ఎత్తే కొద్దీ కరెన్సీ కట్టలు.. ఆపై

Aadhar Card: పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేశారా ? మార్చి 31st లాస్ట్ .. మిస్ చేసారో ఇక అంతే సంగతులు..