Warangal: అర్థరాత్రి ఆరు బయట నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా.. ఇదేం పని..

|

May 15, 2024 | 4:03 PM

దురాశ.. మనిషిని సమాజంలో పలచన చేస్తోంది. నలుగురిలోనూ నవ్వుల పాలు చేస్తోంది. ఓ దొంగ పని చేసి.. అడ్డంగా దొరికిపోయింది ఓ మహిళ. మిగిలినవారు తెలివిగా పారిపోయారు. కానీ ఆమె మాత్రం దొరికిపోయింది. దీంతో తన్నులు తినాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి...

Warangal: అర్థరాత్రి ఆరు బయట నుంచి చప్పుళ్లు.. వెళ్లి చూడగా.. ఇదేం పని..
Thief
Follow us on

ఇప్పుడు పీక్ సమ్మర్ నడుస్తోంది. పొద్దు అంతా ఎండలో పని చేసి.. సోయి తెల్వకుండా నిద్రపోయే రాత్రి సమయం అది. ఆ సమయంలో ఇంటి ముందు నుంచి చప్పుళ్లు వచ్చాయి. ఏంటా అని బయటకు వచ్చి చూస్తే ఏం కనిపించలేదు. మళ్లీ వెంటనే నిద్రలోకి జారుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఎదురింట్లో డాబాపైన పడుకున్నవారు.. కేకలు వేయడంతో.. ఆ ఇంటివాళ్లు లేచి బయటకి వచ్చి చూడగా అసలు బాగోతం వెలుగుచూసింది. ఇంటి ముందు కట్టేసిన బర్రెలను దొంగతనంగా తీసుకెళ్లందుకు కొందరు వేసిన స్కెచ్ భగ్నమైంది.  వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పరిధిలోని సర్వపురంలో ఈ ఘటన వెలుగుచూసింది. గ్రామంలో 5వ వార్డులో నివాసం ఉండే వేముని స్వామికి నాలుగు గేదెలున్నాయి. వాటిని రోజూ ఇంటి ముందు ఉన్నా జాగాలో కట్టేస్తుంటాడు. ఎప్పటిలానే మంగళవారం రాత్రి కూడా బర్రెలను ఇంటి ముందు కట్టేశాడు. ఈ విషయాన్ని గమనించిన నర్సంపేటకు చెందిన నలుగురు దుండగులు.. ఆ బర్రెలపై దొంగతనంగా తోలుకెళ్లాలని ప్లాన్ చేశారు. అయితే పల్లెటూర్లలో.. జనాలు త్వరగా పడుకుంటారు.  అర్ధరాత్రి సమయంలో గాఢ నిద్రలో ఉంటారు. ఈ విషయాన్ని అనువుగా చేసుకున్న ఆ దుండగులు.. బర్రెలను తోలుకెళ్లేందుకు అర్ధరాత్రి ముహూర్తం ఫిక్స్ చేశారు.

ప్లాన్‌లో భాగంగా అక్కడికి వచ్చి సైలెంట్‌గా తోలుకెళ్ధామనుకుంటే.. అవి అరవటం ప్రారంభించాయి.  ఆరుబయట పడుకున్నవారికి గేదెల అరుపులతో  మెలుకువ వచ్చి చూడగా.. ఎవరో నలుగురు వ్యక్తులు బర్రెలను తోలుకెళ్తున్నట్టు కనిపించింది. దీంతో..కేకలు వేయడంతో.. ఇంటి యజమాని బంధువులు లేచి వారి వెంటపడ్డారు. అందులోని ముగ్గురు దొరకకుండా పారిపోగా.. మహిళ మాత్రం దొరికిపోయింది. ఆ దొరికిన మహిళను అదుపు తీసుకొని స్తంభానికి కట్టేశారు. దేహశుద్ధి చేసిన తర్వాత.. అడిగితే అసలు వివరాలు చెప్పింది ఆ మహిళ. ఖానాపురం, కొత్తగూడ చుట్టుపక్క ప్రాంతాల నుంచి బర్రెలను దొంగతనంగా తోలుకొచ్చి..  కోసి అమ్ముతున్నట్లు ఒప్పుకుంది. దీంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి.. ఆ మహిళను వాళ్లకు అప్పగించారు. గేదెల యజమాని ఇచ్చిన కంప్లైంట్‌తో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…