AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైవేపై మరో బస్సు ప్రమాదం.. ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రయాణికుల ప్రాణాలు బలి

వరంగల్-హైదరాబాద్ మధ్య జాతీయ రహదారి NH 163 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగిఉన్న ఇసుక లారీని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు..

Telangana: హైవేపై మరో బస్సు ప్రమాదం.. ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రయాణికుల ప్రాణాలు బలి
Road Accident
G Peddeesh Kumar
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 16, 2025 | 7:51 AM

Share

వరంగల్-హైదరాబాద్ మధ్య జాతీయ రహదారి NH 163 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగిఉన్న ఇసుక లారీని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.. ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణంగా గుర్తించిన పోలీసులు లారీ డ్రైవర్ తో పాటు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

జాతీయ రహదారిపై అజాగ్రత్తగా లారీ డ్రైవర్ ఇసుక లారీ పార్కింగ్ చేశాడు. ఆర్టీసీ డ్రైవర్ ఆ లారీని గమనించకుండా వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు నిండు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున జరిగింది.. TG07UK5469 నెంబర్ గల ఇసుక లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా జాతీయ రహదారిపై నిలిపాడు. ఈ మార్గంలో హనుమకొండ నుండి హైద్రాబాద్ వెళ్తున్న TG03Z0046 నెంబర్ గల సూపర్ లెగ్జరీ రాజధాని బస్సు వెనుకనుండి డీ కొట్టింది. ఈ క్రమంలో బస్సు ఎడమ వైపు భాగం నుజ్జునుజ్జయింది.. బస్సులో ఎడమ వైపు కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి..

మృతులు దిండిగల్ కు చేసిన పులమాటి ఓం ప్రకాష్( 75 ) గా గుర్తించారు.. మరొకరు హనుమకొండలోని బాలసముద్రం ప్రాంతానికి చెందిన నవదీప్ సింగ్ గా గుర్తించారు.. ఆరుగురు క్షతగాత్రులను ఎంజీఎం హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బస్సు నిర్లక్ష్యం.. లారీ డ్రైవర్ అజాగ్రత్త ఈ ప్రమాదానికి కారణమని.. ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. ఇరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో
షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో
షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో
వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియ
వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియ
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో