ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వరంగల్ పట్టణం రడీ అయ్యింది. 30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని వరంగల్‌లో అడుగుపెడుతుండడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో మోదీ రాక కోసం వరంగల్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికాసేపట్లో వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలు దేరనున్నారు ప్రధాని. అనంతరం హకీంపేట్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో వరంగల్ వెళ్తారు.
ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా తొలుత వరంగల్‌లో శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. మోదీ పర్యటను పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. తీరొక్క పూలతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. మోదీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం భద్రకాళి అమ్మవారి టెంపుల్ SPG వలయంలోకి వెళ్లిపోయింది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో వరంగల్‌లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..