Telangana: మునుగోడులో ప్రకంపనలు సృష్టిస్తున్న రాజగోపాల్ రెడ్డి పోస్టర్.. అది వారి పనేనంటూ..

|

Aug 13, 2022 | 12:12 PM

Telangana: మునుగోడు బైపోల్‌ రాజకీయం వేడెక్కింది. మాటల తూటాల నుంచి వాల్‌ పోస్టర్లపైకి వెళ్లింది. మునుగోడులో ఇప్పుడు రాజగోపాల్‌ రెడ్డి పోస్టర్లు..

Telangana: మునుగోడులో ప్రకంపనలు సృష్టిస్తున్న రాజగోపాల్ రెడ్డి పోస్టర్.. అది వారి పనేనంటూ..
Rajagopal Reddy
Follow us on

Telangana: మునుగోడు బైపోల్‌ రాజకీయం వేడెక్కింది. మాటల తూటాల నుంచి వాల్‌ పోస్టర్లపైకి వెళ్లింది. మునుగోడులో ఇప్పుడు రాజగోపాల్‌ రెడ్డి పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రాజగోపాల్‌కు వ్యతిరేకంగా పోస్టర్ల వెలిశాయి.

మునుగోడు నన్ను క్షమించదు అంటూ నారాయణపురం, చౌటుప్పల్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు పోస్టర్లు అంటించారు. రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్‌ కోసం..13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి అంటూ పోస్టర్లలో రాశారు. రాజగోపాల్‌ రెడ్డి ఫోటో ముద్రించి గోడలపై పోస్టర్లను నారాయణపురం, చౌటుప్పల్‌లో అంటించారు. ఈ పోస్టర్లను ఎవరు అంటించారు. కాంగ్రెస్‌ శ్రేణులే అంటించారా? లేకపోతే రాజగోపాల్‌రెడ్డి అంటే గిట్టనివారు ఈ ప్రచారం చేస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఇదిలాఉండగా, కాంగ్రెస్‌ పాదయాత్ర ఇవాళ్టి నుంచి నియోజకవర్గంలో ప్రారంభం అవుతోంది. ఇదే టైమ్‌లో రాజగోపాల్‌ రెడ్డి పోస్టర్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. మొత్తానికి బైపోల్‌ నోటిఫికేషన్‌ రాకముందే అక్కడి రాజకీయం మరింత వేడెక్కింది. ఉప ఎన్నిక డేట్లు వస్తే ఇక రాజకీయం మరింత రంజుగా మారే అవకాశం కన్పిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..