Viveka’s Murder Case: అత్యవసర పనులున్నాయ్‌.. ఇవాళ విచారణకు రాలేను.. సీబీఐకి ఎంపీ అవినాష్‌ లేఖ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నేడు సీబీఐ విచారణపై హై టెన్షన్ నెలకొంది. ఇవాళ విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ.. తనకు అత్యవసర పనులున్నందుకు హాజరుకాలేకపోతున్నట్లుగా సీబీఐ అధికారులకు లేఖ రాశారు. షార్ట్‌ నోటీసు ఇచ్చినందున.. విచారణకు మరింత సమయం ఇవ్వాలని అవినాష్‌రెడ్డి కోరారు.

Vivekas Murder Case: అత్యవసర పనులున్నాయ్‌.. ఇవాళ విచారణకు రాలేను.. సీబీఐకి ఎంపీ అవినాష్‌ లేఖ
Avinash Reddy

Updated on: May 16, 2023 | 12:39 PM

ఇవాళ్టి అవినాష్ రెడ్డి సీబీఐ విచారణలో ఉత్కంఠ నెలకొంది. విచారణకు హాజరుకాలేనంటూ ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. అత్యవసర పనుల కారణంగా విచారణకు రాలేకపోతున్నానని.. మరో మూడు నాలుగురోజులు సమయం కావాలని లేఖలో కోరారు అవినాష్. సోమవారం హైదరాబాద్ కు వచ్చిన అవినాష్ తిరిగి కాసేపట్లో కడపకు బయల్దేరబోతున్నట్లు సమచారం. అయితే అవినాష్ రెడ్డి లేఖను అభ్యర్థనను సీబీఐ తోసిపుచ్చింది. విచారణకు రావాల్సిందేనని చెప్పింది. దీంతో అవినాష్ రెడ్డి … సీబీఐ విచారణకు హాజరవుతారా? ఒకవేళ అవినాష్‌ గైర్హాజరైతే జరగబోయే పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి.. ఏడోసారి సీబీఐ ఎదుట హాజరుకావల్సి ఉంది. 20 రోజుల విరామం అనంతరం.. సీబీఐ కార్యాలయానికి రావాలని అధికారుల ఇచ్చిన నోటీసుల మేరకు మరోసారి సీబీఐ కార్యాలయానికి వెళ్తారు అని అంతా అనుకున్నారు.. కానీ ఆయన రాలేను అంటూ లేఖ రాయడంతో ఇది సంచలనంగా మారింది. ఇప్పటికే ఆరుసార్లు అవినాష్‌ను పిలిచిన అధికారులు.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ప్రధానంగా వివేకా హత్య, ఆధారాలు మాయంపై ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హైకోర్ట్‌లో ముందస్తు బెయిల్ పిటిషన్‌ పెండింగ్‌లో.. అవినాష్‌ విచారణకు హాజరుకాలేను అంటూ లేఖ రాయడంతో ఉత్కంఠగా మారింది. అయితే విచారణ అనంతరం జరిగే పరిణామాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం