AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇది మామూలు పోరు కాదు సామీ.. పామును చీల్చి చెండాడిన ముంగీస.. వీడియో వైరల్..

ప్రకృతిలో బద్ధ శత్రువులంటే గుర్తొచ్చేది పాము, ముంగిసలే. ఈ రెండూ ముఖాముఖి ఎదురుపడితే అక్కడ జరిగేది సాధారణ సమరం కాదు.. ప్రాణాల కోసం సాగే భీకర యుద్ధం.. కాటువేసి ప్రాణాలు తీయాలని నాగుపాము చూస్తే, మెరుపు వేగంతో విరుచుకుపడి అంతం చేయాలని ముంగిస పోరాడుతుంది. తాజాగా అలాంటి ఉత్కంఠభరిత పోరు కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Telangana: ఇది మామూలు పోరు కాదు సామీ.. పామును చీల్చి చెండాడిన ముంగీస.. వీడియో వైరల్..
Snake Vs Mongoose Fight
Naresh Gollana
| Edited By: |

Updated on: Sep 12, 2026 | 6:12 PM

Share

కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూర్‌ మండలం నాగుల్వాయి గ్రామంలో లెండుగురే సాంబయ్య ఇంటి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి దగ్గర నాగుపాము, ముంగిస ఎదురుపడ్డాయి. దీంతో ఒక్కసారిగా రెండింటి మధ్య భీకర పోరు మొదలైంది. పామును చుట్టుముట్టిన ముంగిస.. దాని కదలికలను గమనిస్తూ వేగంగా దాడి చేసింది. పాము కూడా పడగ విప్పి బుసలు కొడుతూ ఎదురుదాడికి ప్రయత్నించింది. అయితే ముంగిస దాడిని తట్టుకోలేక పాము తీవ్రంగా గాయపడింది. చివరకు నెత్తురు కక్కుతూ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

 శత్రుత్వం కాదు.. మనుగడ కోసం పోరాటం

సినిమాల్లో, కథల్లో చూపించినట్లుగా వీటి మధ్య ఉన్నది వ్యక్తుల మధ్య ఉండే ‘పగ’ లేదా ‘జాతి వైరం’ కాదు. ఇది ఆహారం, స్వీయ రక్షణ కోసం ప్రకృతిలో సహజంగా జరిగే పోరాటం. పాము కాటు వేసే క్షణంలో ముంగిస తన చురుకైన శరీర కదలికలతో పక్కకు తప్పుకుంటుంది. పాము విసిగిపోయి అలసిపోయేంతవరకు ఆడిస్తుంది. చివరకు అత్యంత సున్నితమైన పాము తల లేదా మెడ భాగాన్ని లక్ష్యంగా చేసుకుని గట్టిగా పట్టుకుని విరిచేస్తుంది. ముంగిసను ప్రమాదకరమైన ప్రత్యర్థిగా గుర్తించే పాము.. తన ప్రాణాలను కాపాడుకోవడానికే పడగ విప్పి బుసలు కొడుతూ విషపూరిత కాటు వేసేందుకు ప్రయత్నిస్తుంది.

ఎల్లప్పుడూ ముంగిసే గెలవదు

ప్రతి పోరులోనూ ముంగిసే విజయం సాధిస్తుందనుకోవడం పొరపాటు. పాము పరిమాణం పెద్దదై, దాని విషపు కాటు ముంగిసకు తగిలితే ముంగిస కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. విజయం అనేది వేగం, సమయస్ఫూర్తి, పాము విష తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. నాగుల్వాయిలో జరిగిన ఈ సమరంలో మాత్రం ముంగిస వేగమే పైచేయి సాధించి నాగుపామును తుదముట్టించింది. ప్రకృతిలో జీవన మనుగడ కోసం జరిగే ఈ సహజ పోరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

వీడియో చూడండి..

Follow Us