గోమాతకు సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు చేసిన గ్రామస్తులు.. ఎక్కడో తెలుసా?

రైతు ప్రేమకు ఎల్లలుండవు.. అది అయినవారి మీదైనా, పశువుల మీదైనా. ఎంతగా ప్రేమిస్తారో, దూరమైతే అంతగా విలవిల్లాడిపోతారు. తాజాగా ఇలాంటి ఘటనే నిర్మల్‌ జిల్లాలో వెలుగు చూసింది. తమ గ్రామంలోని శ్రీ హనుమాన్‌ మందిరానికి చెందిన ఓ గోవు మరణించడంతో.. ఊరు ఊరంతా కలిసి సాంప్రదాయ ప్రకారం ఆ గోవుకు అంత్యక్రియలు జరిపించారు.

గోమాతకు సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు చేసిన గ్రామస్తులు.. ఎక్కడో తెలుసా?
Cow

Edited By:

Updated on: Jun 20, 2025 | 11:23 PM

రైతు ప్రేమకు ఎల్లలుండవు.. అది అయినవారి మీదైనా, పశువుల మీదైనా. ఎంతగా ప్రేమిస్తారో, దూరమైతే అంతగా విలవిల్లాడిపోతారు. ఊరుకి కాపలాగా ఉన్న దేవతలాంటి గోమాత మృతి చెందింతే ఇక తట్టుకోగలరా. ఆ వేదనను ఆపుకోవడం కాస్త కష్టమే. అలాంటి ఘటనే నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. తమను ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడిన ఆవు కళ్లముందే మృతి చెందడంతో ఆ ఊరు ఊరంతా శోక సంద్రంలో మునిగి పోయింది. కుటుంబ సభ్యున్ని కోల్పోయాం అన్న తీరున సాంప్రదాయ ప్రకారం ఆ గోమాతలు అంత్యక్రియలు నిర్వహించి. ఆ గోవు పై ఉన్న మమకారాన్ని చాటుకుంది ఆ గ్రామం.

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హథ్‌గాం గ్రామంలోని శ్రీ హనుమాన్ మందిరానికి చెందిన ఆవు (గోమాత) అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆ ఊరు ఊరంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. మహిళలు, వృద్ధులు, యువత అంతా కలిసి హిందూ సంప్రదాయ పద్దతిలో ఆ గోమాతకు అంత్యక్రియలు చేశారు. డప్పు వాయుద్యాలతో ఊరేగించి గ్రామ శివారులో హారతి ఇచ్చి అంత్యక్రియలు నిర్వహించింది ఆ గ్రామం. హిందూ సంస్కృతిలో గోవు ఎంత పవిత్రమైందో చాటింది హథ్ గాం గ్రామం. గోవును పూజిస్తే సకల సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయన్నది తమ నమ్మకమని చెప్పుకొచ్చింది ఆ గ్రామ రైతాంగం.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..