Telangana:ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం..

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సు.. లారీని ఢీకొంది.. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.. 20 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి.. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.. వికారాబాద్ పరిగి మండలం రంగాపూర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

Telangana:ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం..
Road Accident

Updated on: May 20, 2025 | 6:44 AM

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొంది.. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.. 20 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి.. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.. వికారాబాద్ పరిగి మండలం రంగాపూర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతులు మల్లేష్, సందీప్, బాలమణి, హేమలతగా గుర్తించారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన పలువురు పరిగిలో జరిగిన విందుకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా తెల్లవారుజామున ఈఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించేలోగా చనిపోయారు. చాలా మంది చేతులు, కాళ్లు కట్ అయినట్లు పేర్కొంటున్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..