Watch Video: డప్పుతో దరువేసిన వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్.. ఫిదా అవుతున్న అభిమానులు

Vikarabad MLA Doctor Anand, ఆయన ఓ ఎమ్మెల్యే.. ఎప్పుడూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బిజీబిజీగా ఉంటారు. అలాంటి ఎమ్మెల్యే డప్పుతో దరువేశారు. సరదాగా కళాకారులతో

Watch Video: డప్పుతో దరువేసిన వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్.. ఫిదా అవుతున్న అభిమానులు
Vikarabad Mla Doctor Anand

Updated on: Jan 01, 2022 | 2:28 PM

Vikarabad MLA Doctor Anand, ఆయన ఓ ఎమ్మెల్యే.. ఎప్పుడూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బిజీబిజీగా ఉంటారు. అలాంటి ఎమ్మెల్యే డప్పుతో దరువేశారు. సరదాగా కళాకారులతో కలిసి స్టెప్పులేస్తూ సందడి చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జిల్లాలోని ధారూర్ మండలం అంపల్లి గ్రామంలో ఒగ్గుడోలు శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఒగ్గు కళాకారులతో కలిసి డోలు వాయించి దరువేశారు. కళాకారులతో పాటు ఆయన కూడా డప్పుతో చిందులేసి సందడి చేశారు. దీంతో అక్కడ ఉన్న వారంతా కేకలు వేస్తూ ఎమ్మెల్యే ఆనంద్‌ను అభినందించారు.

ఈ సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. జిల్లాలో ఒగ్గుడోలు శిక్షణ జరగడం అభినందనీయమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అంతరించి పోతున్న గ్రామీణ కళలను మళ్లీ బతికించాలని ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. ఈ ఉద్దేశంతోనే ఈ కళలను ప్రోత్సహించడం జరిగుతోందని తెలిపారు. ఇలాంటి అవకాశాలను కళాకారులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాకారులతోపాటు.. పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

వీడియో.. 

Also Read:

Sivakasi Blast: కొత్త సంవత్సరం రోజున తీవ్ర విషాదం.. శివకాశి బాణసంచా కర్మాగారంలో పేలుడు

Hyderabad: వనస్థలిపురంలో కారు బీభత్సం.. మద్యం మత్తులో అపార్ట్‌మెంట్‌ గోడను ఢీకొట్టిన యువకులు..