ప్రభుత్వ ఆసుపత్రిలో న్యాయమూర్తి ప్రసవం.. జిల్లా జడ్జికి వెల్లువెత్తిన ప్రశంసలు

రాజన్న సిరిసిల్ల వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చారు. 2023 లో మొదటి కాన్పు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ ప్రసవంతో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. రెండవ ప్రసవం కూడ ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవంతోనే మగ బిడ్డకు జన్మనిచ్చారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో న్యాయమూర్తి ప్రసవం.. జిల్లా జడ్జికి వెల్లువెత్తిన ప్రశంసలు
Minister Damodara Rajanarsimha, Junior Judge Jyothirmayi

Edited By:

Updated on: May 25, 2025 | 12:53 PM

ఉన్నత స్థాయిలో ఉండి, జ్యుడిషియల్ హోదా ఉన్నా.. ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే శిశువుకు జన్మనిచ్చారు జూనియర్ సివిల్ జడ్జి.. వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా న్యాయమూర్తి జ్యోతిర్మయి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. సాధారణ కాన్పు ద్వారా మగబిడ్డకు జన్మించారని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా జడ్జి స్వయంగా ఇక్కడ సేవలు పొందడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చారు. 2023 లో మొదటి కాన్పు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ ప్రసవంతో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. రెండవ ప్రసవం కూడ ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవంతోనే మగ బిడ్డకు జన్మనిచ్చారు.

గత మూడు సంవత్సరాలుగా వేములవాడలో జూనియర్ సివిల్ జడ్జిగా జ్యోతిర్మయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త కూడ సిరిసిల్ల జూనియర్ సివిల్ జడ్జి, ఉన్నత స్థాయిలో ఉండి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మనిచ్చినందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ట్వీటర్ లో అభినందనలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలపై నమ్మకాని పెంచేందుకు వేములవాడ జడ్జి జ్యోతిర్మయి నిదర్శనము అని మంత్రి ట్వీటర్ ద్వార అభినందించారు.

తెలంగాణ ప్రతి ఆడ బిడ్డకు ఆమెనే స్ఫూర్తి అని మంత్రి రాజనర్సింహ అన్నారు. ప్రభుత్వం ఆసుపత్రి లోనే వైద్యే సేవలు వినియోగించుకోవాలనే ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి లో అన్ని సౌకర్యాలు ఉన్న.. ఇంకా చికిత్స తీసుకోవడానికి వెనుక ముందు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్న విషయాన్నీ ఈ జడ్జి గుర్తు చేశారు. వీలైనంత వరకు ప్రభుత్వ ఆసుపత్రి లోనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలని ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు పొంది అందరికీ ఆదర్శంగా నిలిచారని సీనియర్‌ కోర్టు ఏజీపీ ప్రశాంత్‌ కుమార్, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుండ రవి, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..