Vegetable prices: చుక్కలనంటుతున్న కూరగాయల ధరలు.. సెంచరీ దాటిన బీరకాయ, చిక్కుడు, పచ్చి మిర్చి

|

Nov 01, 2021 | 7:34 AM

వెజిటేబుల్స్‌ ధరల జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులకు తోడు పెట్రో ధరల ప్రభావంతో కూరగాయల రేట్లు రెట్టింపు అయ్యాయ. కొన్ని రకాలు చికెన్‌ ధరలతో పోటీ పడుతున్నాయి.

Vegetable prices: చుక్కలనంటుతున్న కూరగాయల ధరలు.. సెంచరీ దాటిన బీరకాయ, చిక్కుడు, పచ్చి మిర్చి
Vegetable Prices
Follow us on

కూరగాయల రేట్లు జనానికి వణుకు పట్టిస్తున్నాయి. శీతాకాలంలో చలితో పాటు.. ధలు పోటీ పడుతున్నాయి. కొన్నివెజిటేబుల్స్‌ అయితే.. నాన్‌ వేజ్‌తో పాటీ పడుతున్నాయి. ఇలా పలు రకాలైన కూరగాయల ధరలు ఆకాశాన్నంటతున్నాయి. ఇప్పటికే బీరకాయ, చిక్కుడు, పచ్చిమిర్చి, వంకాయ, టమోటాల కిలో ధర సెంచరీ దాటి పోయింది. అనపకాయ, అలిచింత, దోసకాయ ధరలు 70 రూపాయలకు చేరుకుంది. ఇక ఆకుకూరల ధరలు కూడా అందుకోలేని స్థాయికి చేరుకున్నాయి. కొత్తిమీర, పూదీన, మెతంతో పాటు.. ఇతర ఆకుకూరలు అయితే.. 10 రూపాయలకు ఒక్కటి కూడా రావడం లేదు. ఈ ధరలను చూసిన జనం బెంబేలెత్తి పోతున్నారు. కొందామంటేనే వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. కొన్నా తక్కువ మోతాదులో కొని కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడా చూసినా ఇలాంటి ధరలే ఉండడంతో జనం ఏమి చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదని జనం వాపోతున్నారు. ఈ ధరలకు పలు రకాల కారణాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. చేతికొచ్చిన పంట నీటి పాలు కావడం, కాయ, పూత దెబ్బతినడం వల్ల ధరలు అమాంతంగా పెరిగి పోయాయయి. ఇక పెట్రో మంట కూడా ఒక కారణంగా నిలిచింది. పెట్రోల్‌ ధరలు రోజు రోజుకు పెరిగి పోవడంతో ఆ ప్రభావం కూరగాయలపై పడింది. గ్రామాల్లోనుంచి పట్టణాలకు కూరగాయలను తీసుకొచ్చేందుకు భారీ వ్యయం అవుతోంది. దీంతో ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు పెరిగాయి. తప్పని పరిస్థితుల్లో ఛార్జీల భారాన్ని కూరగాయలపై వేయాల్సి వస్తోందంటున్నారు అమ్మకం దారులు. ఈ పరిస్థితుల్లో ధరలకు కళ్లెం వెయ్యాలంటే ప్రభుత్వం రంగంలోకి దిగాల్సిన అవసరం ఏర్పడింది. వాహన దారులతో మాట్లాడి పొలం దగ్గర కొన్న రేట్లకు వినియోగ దారులకు అందించే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆకాశాన్ని అంటుతున్న ధరలను అదుపు చేయగలుగుతారు తప్పితే.. మరో మార్గం లేదు.

Also Read: పవన్ డెడ్‌లైన్‌పై వైసీపీ కౌంటర్.. రివర్స్ పంచ్ వేసిన అంబటి..

శివారులో షాకింగ్ సీన్.. జూదశాలగా మారిన ఓ యువ హీరో ఫామ్‌హౌస్‌‌.. అతడు ఎవరంటే..?