రూట్ మార్చిన ప్రేమ వివాహాలు.. దొంగ సర్టిఫికేట్లతో ఊరు కానీ ఊరులో పెళ్లి

రెండు వర్గాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఏకంగా దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఉత్తర ప్రదేశ్ రాష్టానికి చెందిన జంట హైదరాబాద్ చంపాపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివాహ రిజిస్ట్రేషన్ వెలుగులోకి వచ్చింది. విషయం బయటకు పొక్కడంతో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.

రూట్ మార్చిన ప్రేమ వివాహాలు.. దొంగ సర్టిఫికేట్లతో ఊరు కానీ ఊరులో పెళ్లి
Love Marriage

Edited By:

Updated on: May 22, 2025 | 9:23 AM

రెండు వర్గాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఏకంగా దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఉత్తర ప్రదేశ్ రాష్టానికి చెందిన జంట హైదరాబాద్ చంపాపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివాహ రిజిస్ట్రేషన్ వెలుగులోకి వచ్చింది. విషయం బయటకు పొక్కడంతో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. రిజిస్ట్రార్ తో వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్తతకు దారి దారితీసింది. నకిలీ ఆధార్, నివాస ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేస్తారని నిలదీశారు. పోలీసుల జోక్యంతో ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఉత్తరప్రదేశ్ ఫారీదాబాద్‌కు చెందిన వేర్వేరు మతాలకు చెందిన జంట ఏప్రిల్ నెలలో హైదరాబాద్ లోని చంపాపేట్ రిజస్ట్రార్ కార్యాలయంలో వివాహ రిజిస్ట్రేషన్ చేయించారు. ధ్రువీకరణ సర్టిఫికెట్ మంజూరు చేసే క్రమంలో వెలుగులోకి రావడంతో బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దొంగ పత్రాలు పరిశీలించకుండా సర్టిఫికేట్ మంజూరు చేసిన వ్యవహారంపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లవ్ జిహాదీ లను నిషేదించారని బీజేపీ నేతలు గుర్తు చేశారు. హిందూ, క్రిస్టియన్ యువతులే లక్ష్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు ట్రాప్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ వివాహల రిజిస్ట్రేషనలపై విచారణ చేపట్టాలని యాకత్ పురా నియోజకవర్గ అధికార ప్రతినిధి వీరేందర్ బాబు డిమాండ్ చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..