Minister Kishan Reddy: యోగా ఇంటర్నేషనల్ డేకి 25 రోజుల కౌంట్‌డౌన్.. 20 వేల మందితో హైదరాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో యోగా మహోత్సవ్

|

May 26, 2023 | 8:59 PM

యోగా ఒక జ్ఞానం.. ఒక మార్గం.. ఒక చైతన్యం.. యోగా ఒక ఆధ్యాత్మిక వైద్యం.. యోగా భారతీయ సాంస్కృతిక జీవన విధానం. మనసుతో మనిషిని అనుసంధానం చేసే అద్భుతమైన ప్రక్రియ. అందుకే యోగాతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా శ్రమిస్తోంది కేంద్ర ప్రభుత్వం. యోగా ఇంటర్నేషనల్ డే సన్నాహక చర్యల్లో భాగంగా రేపు హైదరాబాద్‌లో మెగా ఈవెంట్‌ జరగబోతోంది.

Minister Kishan Reddy: యోగా ఇంటర్నేషనల్ డేకి 25 రోజుల కౌంట్‌డౌన్.. 20 వేల మందితో హైదరాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో యోగా మహోత్సవ్
Yoga Mahotsav
Follow us on

జూన్ 21… అంతర్జాతీయ యోగా దినోత్సవం. మార్చి 13 నుంచి 100 రోజులపాటు దేశవ్యాప్తంగా యోగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది ఆయుష్ మంత్రిత్వ శాఖ. చివరి 25 రోజుల కౌంట్‌డౌన్‌కి సూచికగా హైదరాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో యోగా మహోత్సవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమం జరగబోతోంది. 100 రోజుల కౌంట్‌డౌన్ ఈవెంట్ న్యూఢిల్లీలో, 75 రోజుల మహోత్సవం అసోమ్‌లోని దిబ్రూఘర్‌లో, 50వ రోజు కౌంట్‌డౌన్‌ జైపూర్‌లో షురూ ఐంది. ఇప్పుడు 25వ రోజు కౌంట్‌డౌన్‌కి సంకేతంగా హైదరాబాద్‌లో యోగా మహోత్సవ్ నిర్వహిస్తోంది మోదీ సర్కార్.

‘మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా’ సహకారం అందిస్తోంది. ఇందుకు సంబంధించి పరేడ్‌గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. దేశపు ఐక్యతను చాటేందుకు, ప్రపంచ సమాజానికి యోగా సాధనపై అవగాహన పెరగడానికి యోగా మహోత్సవ్ ఒక బెంచ్‌మార్క్‌గా మారే అవకాశముంది.

మే 27 ఉదయం 6 గంటలకు మొదలయ్యే యోగా మహోత్సవ్‌లో తెలంగాణా గవర్నర్‌ తమిళిసై ముఖ్య అతిథిగా పాల్గొంటారు. జంటనగరాల్లోని ప్రముఖులు, క్రీడాకారులు, సీనియర్ అధికారులతో పాటు 20 వేలమందికి పైగా యోగా ఔత్సాహికులు హాజరవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. యోగా మహోత్సవ్‌కి హైదరాబాద్ వేదిక కావడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో ఘనంగా జరిగిందీ వేడుక.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం