Minister G. Kishan Reddy letter to CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (CM KCR) కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Minister G. Kishan Reddy ) మరోసారి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ (Telangnaa Govt)సహకారం లేని కారణంగా రైల్వే ప్రాజెక్టులు (railway projects) ఆలస్యమవుతున్నాయని ఆ లేఖలో ఆరోపించారు. రాష్ట్రంలో అమలు అవుతున్న రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనందువల్లే ఆలస్యం అవుతుందని లేఖలో పేర్కొన్నారు. రైల్వే ప్రాజెక్టు ల విషయంలో తెలంగాణ మీద కేంద్రం వివక్ష చూపుతుందని టీఆరెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2014 – 15 లో 250 కోట్లు ఉన్న బడ్జెట్ 2021- 22లో 2420 కోట్లకు చేరిందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ భరించాల్సిన వ్యయాన్ని, భూ కేటాయింపులు త్వరితగతిన పూర్తి చేయాలని కిషన్‌రెడ్డి కోరారు. మోడీ హాయంలో రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణకు 9 రెట్ల అధిక కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైలు మార్గం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల వాటా పెండింగ్‌లో ఉందని తన లేఖలో వెల్లడించారు. 342 హెక్టార్ల భూమి రైల్వేకు అప్పగించాల్సి ఉందని..అది ఇంత వరకు జరగలేదని అన్నారు. అక్కన్నపేట-మెదక్ రైలుమార్గంలో 31కోట్ల నిధులు, 1 హెక్టారు భూమిని అప్పగించాల్సి ఉందన్నారు.
ఇక MMTS ఫేజ్ టూ ప్రాజెక్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వం 760 కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉండగా.. కేవలం రూ. 129 కోట్లు మాత్రమే జమ చేసిందన్నారు. 54 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరైనప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి సరైన సహకారం లేదన్నారు.
కృష్ణా నుంచి వికారాబాద్, కరీంనగర్ నుంచి హసన్‌పర్తి, బోధన్ నుంచి లాతూర్ కొత్త రైల్వే లైన్ మూడు ప్రాజెక్టుల సర్వే పూర్తయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ వాటాపై ధృవీకరణ ఇంతవరకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు కేంద్రం కేటాయించిన నిధులను లేక్కలతో సహా సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
ఇవి కూడా చదవండి: Viral Video: నువ్వు తగ్గొద్దన్న.. పాకిస్తాన్ జర్నలిస్ట్ మళ్లీ ఏసేశాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
TTE Rules: రాత్రి రైలు ప్రయాణంలో టీటీఈ డిస్టర్బ్ చేయొద్దంటే ఇలా చేయండి..