Kishanreddy on KCR: సర్జికల్ స్ట్రైక్స్‌పై వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం.. సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్!

|

Feb 14, 2022 | 4:25 PM

భారత సాయుధ బలగాలపై తెలంగాణ సీఎం చేసిన బాధ్యతారహిత ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Kishanreddy on KCR: సర్జికల్ స్ట్రైక్స్‌పై వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం.. సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్!
Kishan Reddy Kcr
Follow us on

Minister Kishan Reddy on CM KCR: తెలంగాణ(Telangana)లో అధికార టీఆర్ఎస్(TRS) విపక్ష బీజేపీ(BJP)ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గులాబీ దళపతి కేంద్రం సర్కార్ లక్ష్యంగా సమరశంఖం పూరించారు.టీఆర్ఎస్ TRS యుద్ధం చేస్తామంటే మేం రెడీ అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. సర్జికల్ స్ట్రైక్స్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత సాయుధ బలగాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన బాధ్యతారహిత ప్రకటనను తీవ్రంగా ఖండించారు కిషన్ రెడ్డి. ప్రధాని నరేంద్రమోడీని లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు. కానీ మన దేశభక్తి సాయుధ దళాలను అవమానించడం దురద‌ృష్టకరమన్నారు.

భారత సాయుధ బలగాలపై తెలంగాణ సీఎం చేసిన బాధ్యతారహిత ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పుల్వామా ఉగ్రదాడి జరిగి వార్షికోత్సవం సందర్భంగా సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనాలోచితం, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం, అజ్ఞానమని ధ్వజమెత్తారు కిషన్‌రెడ్డి. ప్రెస్‌మీట్ పెట్టిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై నిర్వహించినట్లుగా చెబుతోన్న సర్జికల్ స్ట్రైక్స్‌పై అనుమానాలను లేవనెత్తారు. దేశ సరిహద్దులకు అవతల, పాకిస్తాన్ భూ భాగంపై బాలాకోట వద్ద గల జైషె మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం నిర్వహించిన దాడులు కాకుండా సర్జికల్ స్ట్రైక్స్ గురించి కేసీఆర్ ప్రశ్నించారు. దీనికి గల సాక్ష్యాధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పుల్వామా ఉగ్రదాడి జరిగి వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇలా మాట్లాడడం, ముఖ్యమంత్రికి ఉన్న ఆవేదనను, బాధ్యతారాహిత్యాన్ని, అజ్ఞానాన్ని తెలియజేస్తోంది.

సర్జికల్ స్ట్రైక్స్‌కు రుజువు అడగడం ద్వారా, కేసీఆర్ ఇప్పుడు మన సాయుధ బలగాలపై దుష్ప్రచారం చేయడానికి తుక్డే తుక్డే గ్యాంగ్‌లో చేరారని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రధాని నరేంద్రమోడీని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు ఉందన్న కిషన్ రెడ్డి.. మన దేశభక్తి సాయుధ దళాలను అవమానించడం కేవలం బాధ్యతారాహిత్యమన్నారు. దేశ రక్షణకు అభినందన్ వర్థమాన్ పరాక్రమం చాలదా? బాలాకోట్ రుజువు తర్వాత 6 నెలలకు పైగా తమ సొంత గగనతలంలో ఫ్లై జోన్‌ను నిషేధించిన పాకిస్థాన్ సొంత చర్యలు సరిపోదా? అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇవి సరిపోకపోతే కేసీఆర్ నేరుగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దగ్గరే రుజువు కోరవచ్చన్నారు.భారత సాయుధ బలగాలు అనేక రకాలుగా సరిహద్దుల వెంబడి మన శత్రువులపై ధైర్యంగా పోరాడుతున్నాయన్నారు. గత సంవత్సరం కల్నల్ సంతోష్ బాబు అనే తెలుగు బిడ్డ మనల్ని రక్షించడానికి తన ప్రాణాలను వదులుకున్నాడన్నారు. మన గొప్ప దేశాన్ని కాపాడుకోవడంలో వీరమరణం పొందిన వారిని అవమానించవద్దని సీఎం కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి కోరారు.


Read Also… Basvaraj Bommai: సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలల్లో సౌమ్యుడు కఠినంగా మారాడు.. కారణం అదేనా?