16మంది అధికారులకు ఐఏఎస్ హోదా.. అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సుదీర్ఘ కాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులకు ఈ నిర్ణయంతో భారీ ఊరట లభించింది. వివిధ కేటగిరీలలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) హోదా కల్పిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది.

16మంది అధికారులకు ఐఏఎస్ హోదా.. అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Union Minister Kishan Reddy Congratulates Telangana State Civil Service Officers

Updated on: Jan 21, 2026 | 9:24 PM

తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సుదీర్ఘ కాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులకు ఈ నిర్ణయంతో భారీ ఊరట లభించింది. వివిధ కేటగిరీలలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) హోదా కల్పిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ మొత్తం 16 మంది అధికారులకు అవకాశం కల్పించింది. ఈమేరకు సిబ్బంది, శిక్షణ శాఖ బుధవారం (జనవరి 21) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 2022, 2023, 2024 సంవత్సరాలకు సంబంధిత అధికారులను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ క్యాడర్‌కు కేటాయిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

తెలంగాణ అధికారులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) హోదా కల్పించడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎంపికైన అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీదియా వేదికగా పేర్కొన్నారు.‘‘ భారత పరిపాలనా సేవకు నియమితులైన తెలంగాణ రాష్ట్ర పౌర సేవ అధికారులకు హృదయపూర్వక అభినందనలు. ఈ గుర్తింపు సంవత్సరాల అంకితభావం, ప్రజా సేవను ప్రతిబింబిస్తుంది. జాతి నిర్మాణంలో మీరు ఉన్నత బాధ్యతలను నిర్వహిస్తున్నందున మీరు గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’’ అంటూ పేర్కొన్నారు.

IAS హోదా దక్కిన అధికారుల్లో డి. మధుసూదన్ నాయక్, ఎం.సత్యవాణి, జె.భవానీ శంకర్, జి.లింగయ్య నాయక్, ఎ. నరసింహా రెడ్డిచ, జి. వీరారెడ్డి, జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, యు.రఘురామ్ శర్మ, పి.చంద్రయ్య, జి.ముకుంద రెడ్డి, ఎ.భాస్కర్ రావు ఉన్నారు. వై.వి.గణేష్, అబ్దుల్ హమీద్, బి.వెంకటేశ్వర్లు, ఎన్.ఖీమ్యా నాయక్, కె.గంగాధర్‌ ఉన్నారు. అయితే, ఈ నియామకాలు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్ తుది తీర్పునకు లోబడి ఉంటుందని కేంద్ర ప్రభుత్వంజారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..