Secunderabad-Tirupati Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ట్రైన్ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ రైలులో ప్రస్తుతం 8 కోచ్‌లు ఉండగా, ప్రయాణికుల కోరిక మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి 16 కోచ్‌లను ఏర్పాటు చేయబోతున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇక ఇందులో 14 ఏసీ కోచ్‌లు, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి. అలాగే సీట్ల సంఖ్య 530 నుంచి 1036కి పెరగనుంది.
అయితే ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌లో 52 సీట్లు, చైర్‌కార్‌లో 478 సీట్లతో మొత్తం 530 సీట్లు ఉన్నాయి. ఈ రైలు ఆక్యుపెన్సీ ఏప్రిల్‌లో 131 శాతంగా నమోదైంది, మే మొదటి పది రోజుల్లో ఆక్యుపెన్సీ 134 శాతంగా ఉందని సమాచారం. అలాగే తిరుపతి నుంచి బయలుదేరిన వందే భారత్ రైలు ఏప్రిల్‌లో 136 శాతం, మే నెలలో 137 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. అంతకముందు ఏప్రిల్ 8న సికింద్రాబాద్ నుంచి ఈ వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన సంగతి తెలిసిందే..
Owing to persistent demand from passengers and 100% occupancy, I am glad to announce that starting Wednesday, 17th May the 20701/20702 Secunderabad-Tirupati-Secunderabad #VandeBharat Express will be running with 16 coaches instead of 8.
1/2 pic.twitter.com/CeW6qqoSaJ— G Kishan Reddy (@kishanreddybjp) May 14, 2023
మరోవైపు ఉదయం 6గంటలకు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్(20701) రైలు మే 17 నుంచి ఉదయం 6.15 గంటలకు బయల్దేరేలా అధికారులు మార్పులు చేశారు. అలాగే నల్గొండకు ఉదయం 7.29/7.30 గంటలకు; ఆ తర్వాత గుంటూరుకు 9.35/9.40; ఒంగోలు 11.09/11.10; నెల్లూరు మధ్యాహ్నం 12.29/12.30 గంటలకు వెళ్లి అక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలయ్యే సరికి తిరుపతికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాక, తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరే రైలు(20702) నిర్ణీత స్టేషన్లలో ఆగుతూ అదే రోజు రాత్రి 11.30గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. స్థానాలను చేరనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..