Sadar Festival: హైదరాబాద్‌లో గ్రాండ్‌గా సదర్‌ సంబురాలు.. ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు..

|

Nov 03, 2024 | 6:57 AM

భాగ్యనగరంలో సదర్‌ సంబురాలు అంబరాన్నంటాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 40 ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకలు అదిరిపోయాయి. దున్నపోతుల అలంకరణ, వాటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి

Sadar Festival: హైదరాబాద్‌లో గ్రాండ్‌గా సదర్‌ సంబురాలు.. ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు..
Sadar Festival In Hyderabad
Follow us on

ప్రతి సంవత్సరంలాగే దీపావళి తర్వాత జరిగే సదర్‌ సెలబ్రేషన్స్‌ ఈసారి కూడా గ్రాండ్‌గా జరిగాయి. హైదరాబాద్‌తో పాటు నగర శివారులో మొత్తం 40 ప్రాంతాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంజాగుట్ట, ఎల్లారెడ్డి గూడ, ఖైరతాబాద్, కొత్తపేట, బోయిన్ పల్లి, సైదాబాద్‌లో సహా చాలా ప్రాంతాల్లో సదర్ సమ్మేళనాలు జోరుగా సాగాయి. కోట్ల రూపాయల విలువ చేసే దున్నపోతుల విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.

యాదవుల సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే ఈ సదర్ ఉత్సవాలను తిలకించేందుకు యాదవులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే కళాకారుల నృత్యాలు, యాదవుల విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఇటు హైదరాబాద్‌ నారాయణగూడలో జరిగిన సదర్ ఉత్సవాలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. కాసేపు కళాకారుల ఆటపాటలను తిలకించారు. యాదవుల ఐకమత్యాన్ని కొనియాడారు.

 

అలంకరించిన గేదెలతో పెద్ద ఊరేగింపు నిర్వహించే ఈ ప్రదర్శనలో యాదవ సమాజమే కాకుండా లక్షలాది మంది పాల్గొంటారని కేంద్ర మంత్రి రెడ్డి తెలియజేశారు.

దీపావళి తర్వాత సదర్ పండుగను జరుపుకుంటారు. ఈ పండగలో సదర్ అనే పేరుతో గేదెల ఊరేగింపు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరి ఆనందం కోసం ప్రజలు ప్రార్థిస్తారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని.. పాలు సంవృద్దిగా దొరకాలని కోరుకుంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..