Save soil: 15ఏళ్ల బాలిక సాహాసం..ఏకంగా 5వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర..ఎందుకంటే..

|

May 22, 2022 | 8:19 PM

రాబోయే కాలంలో వచ్చే ఆహార కొరతను గుర్తించిన ఓ 15ఏళ్ల బాలిక ఎవరూ అలుపెరుగని సాహాసం చేస్తోంది. సేవ్‌ సాయిల్‌ నినాదంతో సైకిల్‌ యాత్ర చేపట్టింది. 15 సంవత్సరాల బాలిక వెన్నెల,

Save soil: 15ఏళ్ల బాలిక సాహాసం..ఏకంగా 5వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర..ఎందుకంటే..
Save Soil
Follow us on

రాబోయే కాలంలో వచ్చే ఆహార కొరతను గుర్తించిన ఓ 15ఏళ్ల బాలిక ఎవరూ అలుపెరుగని సాహాసం చేస్తోంది. సేవ్‌ సాయిల్‌ నినాదంతో సైకిల్‌ యాత్ర చేపట్టింది. 15 సంవత్సరాల బాలిక వెన్నెల, సేవ్ సాయిల్ నినాదంతో 5 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర కొనసాగిస్తోంది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా నుంచీ 21 రోజులుగా 5000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేస్తోంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేట గ్రామానికి చెందిన వెన్నెల అనే అమ్మాయి ఇటీవలే పదో తరగతి పూర్తి చేసింది. భూసారం పెంచాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టానని చెబుతోంది వెన్నెల.

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వెన్నెల ను విజయవాడలో కలెక్టర్ క్యాంపు ఆఫీసులో రిసీవ్ చేసుకున్నారు.. పాలసీ మేకర్స్, వ్యవసాయంపై అవగాహన ఉన్న వారు చేయాల్సిన పని చిన్నపిల్ల చేయడాన్ని ఆయన అభినందించారు‌. వెన్నెలకు తన వంతుగా పదివేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు కలెక్టర్ ఢిల్లీరావు.. జగ్గీ వాసుదేవ్ వల్ల ప్రభావితం అయ్యి ఇలా యాత్ర చేసానని చెపుతోంది బాలిక వెన్నెల… బీద కుటుంబం నుంచీ వచ్చిన తను రెండు తెలుగు రాష్ట్రాల రైతులను కలిసి భూసారం పెంచాలనే విషయంపై అవగాహన కల్పిస్తానంటోంది. రాబోయే తరాలను రక్షించాలని లక్ష్యంతోనే తాను ఈ యాత్ర చేపట్టానని తెలిపింది… ప్రభుత్వాలు సేవ్ సాయిల్ పై ఒక పాలసీ తీసుకురావాలంటోంది వెన్నెల.

 

ఇవి కూడా చదవండి