Prank video: క్లాస్ రూమ్‌లో బెంచ్‌పై బల్లి పడితే,.. ఆ అమ్మాయిల్ని చూడాలి మరీ !..ఫన్నీ సీన్ వైరల్
స్కూల్ డేస్..అంటే మనలో ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి..అప్పటి సంగతులు గుర్తు చేసుకుంటుంటే..ఎంత టైమ్ గడిచిపోతుందో కూడా చెప్పలేము..ప్రస్తుత కాలంలో పెద్దవాళ్లుగా ఎదిగిన మనం, స్కూల్ రోజుల్లో జరిగిన సంగతులు నెమరువేసుకునేందుకే..
స్కూల్ డేస్..అంటే మనలో ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి..అప్పటి సంగతులు గుర్తు చేసుకుంటుంటే..ఎంత టైమ్ గడిచిపోతుందో కూడా చెప్పలేము..ప్రస్తుత కాలంలో పెద్దవాళ్లుగా ఎదిగిన మనం, స్కూల్ రోజుల్లో జరిగిన సంగతులు నెమరువేసుకునేందుకే పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తుంటారు చాలా మంది. స్నేహితులతో కలిసి చేసిన అల్లరి గుర్తుకు రాగానే మనసు గిలిగింతలు పెడుతుంది. ప్రతి ఒక్కరూ పాఠశాల జీవితానికి తిరిగి వెళ్లాలని కోరుకుంటారు. ఆ స్నేహితులతో గడిపిన క్షణాలు. ఆ క్షణాలను మళ్లీ మళ్లీ గుర్తుకు సుకోవాలనుకుంటారు..ఇకపోతే, స్కూల్ డేస్, కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుంటే, మనకు తెలియకుండానే మనం చిన్నవాళ్లం అయిపోతాం..ఆటోమేటిక్‌గా అంతుచిక్కని సంతోషం పొందుతుంటాం..స్కూలు, కాలేజీల పులుపు, తీపి అనుభవాలను జ్ఞాప్తికి తెచ్చే ఓ అందమైన వీడియో ఒకటి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోలో స్కూల్ పిల్లల సరదాలు కనిపిస్తాయి. మిమ్మల్ని భయడపెడుతూనే కడుపుబ్బ నవ్వించే వైరల్ వీడియో ఇది… సాధారణంగానే ఆడపిల్లలకు బల్లులు, బొద్దింకలంటే చాలా భయపడుతుంటారు.. ఇంట్లో ఎక్కడైనా బల్లి, బొద్దింక ఎలుక వంటికి కనిపిస్తే ఆడపిల్లలు ఇల్లంతా తలపై ఎత్తుకున్నంత పనిచేస్తారు..ఇక్కడ ఓ క్లాస్ రూమ్‌లో బెంచ్‌లపైకూర్చుని ఉన్నారు కొందరు అమ్మాయిలు. అదే సమయంలో ఒక అమ్మాయి తన సీటులోంచి పైకి లేచి వచ్చి ఎదురుగా కూర్చున్న ఇద్దరు అమ్మాయిలలో ఒకరి అద్దాలు, మొబైల్ ఫోన్ తీసుకుంది..అదే బెంచ్ మీద ఓ ప్లాస్టిక్ బల్లిని పెట్టింది. ఇది చూసిన ఆ ఇద్దరమ్మాయిల భయం చూడాలి మరీ..వీడియో చూస్తున్నప్పుడు మనం కూడా భయంతో వెనక్కి పడిపోతాం…
ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రియాసచిన్_గౌతమ్ అనేబడే ఓ యూజర్ ఈ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట జనాల్ని తెగ ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ తమ బాల్యాన్ని గుర్తు చేసుకున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.