J&K tunnel collapse: జమ్మూలో కూలిన సొరంగం ఘటనపై కేంద్రం ప్రభుత్వం కీలక ఆదేశాలు..దర్యాప్తు ముమ్మరం

జమ్మూ కాశ్మీర్‌ శ్రీనగర్‌లోని రాంబన్‌లో సొరంగం కూలిన ఘటనపై కేంద్రప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఘటనపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో..

J&K tunnel collapse: జమ్మూలో కూలిన సొరంగం ఘటనపై కేంద్రం ప్రభుత్వం కీలక ఆదేశాలు..దర్యాప్తు ముమ్మరం
Tunnel At Ramban
Follow us

|

Updated on: May 22, 2022 | 7:51 PM

J&K tunnel collapse: జమ్మూ కాశ్మీర్‌ శ్రీనగర్‌లోని రాంబన్‌లో సొరంగం కూలిన ఘటనపై కేంద్రప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఘటనపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కమిటీని కోరింది. అదే సమయంలో, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రాథమిక ప్రక్రియను ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్‌లో గురువారం రాత్రి నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంత భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో చాలా మంది సజీవీ సమాధి అయ్యారు. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. రాంబన్ జిల్లాలోని జమ్మూ-కాశ్మీర్ జాతీయ రహదారిపై నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీనిలో భాగంగా ఒక కొండ మధ్యలో సొరంగం తవ్వుతుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాల స్వాధీనంతో రెస్క్యూ ఆపరేషన్ పూర్తైనట్లు అధికారులు వెల్లడించారు.

రాంబన్ జిల్లాలోని ఒక నాలా వద్ద సొరంగ నిర్మాణం జరుగతుండగా, గురువారం రాత్రి టన్నెల్ కూలిపోయింది. దీంతో శిథిలాల్లో చిక్కుకున్న పది మంది కూలీల కోసం అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. శనివారం సాయంత్రానికి పది మంది మృతదేహాలను స్వాధీనం చేసుకుని, ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని అధికారులు తెలిపారు. పదిమంది మృతుల్లో ఐదుగురు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు.. ఘటనపై కేసు నమోదు చేశామని, మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని రాంబన్ జిల్లా ఎస్పీ, అధికారులు తెలిపారు. సొరంగం కూలిపోయిన వెంటనే నలుగురిని రక్షించారు. పోలీసులు, సైన్యం సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. రాంబన్‌ డిప్యూటీ కమిషనర్‌, డీఐజీ, ఎస్‌ఎస్పీ, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌హెచ్‌ఏఐ, నిర్మాణ సంస్థ ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సొరంగం ముందు వైపు పార్క్ చేసిన బుల్డోజర్లు, ట్రక్కులతో సహా అనేక వాహనాలు, యంత్రాలు దెబ్బతిన్నాయి.

ఇవి కూడా చదవండి