Uncle and daughter-in-law died with Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసుల సంఖ్య మూడున్నర లక్షలు దాటగా… మరణా సంఖ్య మూడు వేలకు చేరువల ఉంది. ఈ తరుణలంలో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. కరోనా మహమ్మారి కుటుంబాలకు కుటుంబాలనే కబళిస్తోంది. తెలంగాణలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల చాలామంది కరోనా కారణంగా మరణిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో కరోనా కారణంగా అన్న దమ్ములు మరణించిన సంఘటన మరువకముందే హైదరాబాద్ పరిధిలో కరోనాతో మామ, కోడలు కన్నుమూశారు.
ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ పరిధిలోని హయత్‌నగర్ ముదిరాజ్ కాలనీలో చోటుచేసుకుంది. కాలనీలో ఉంటున్న ఓ కుటుంబం కరోనా లక్షణాలతో బాధపడుతుంటే.. గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో మామ (80) చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. ఈ క్రమంలో ఆయనకు మధ్యాహ్నం వేళ కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కోడలు (50) కూడా గాంధీ ఆసుపత్రిలో చనిపోయినట్లు సమాచారం వచ్చింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
కాగా తెలంగాణలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం 10,122 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. నిన్న ఒక్కరోజే 52 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కి చేరింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా 2,094 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 69,221 యాక్టివ్ కేసులున్నాయి.
Also Read: