షెడ్‌ నుంచి విగ్రహం బయటకు తీస్తుండగా తగిలిన విద్యుత్‌ వైర్లు.. కరెంట్‌ షాక్‌తో ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు!

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కోరుట్ల పట్టణంలోని జిఎస్ గార్డెన్ సమీపంలో ఉన్న వినాయక విగ్రహాల తయారీ షెడ్‌లోని విగ్రహాలను బయటకు తీస్తుండగా పక్కనే ఉన్న 133/ 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

షెడ్‌ నుంచి విగ్రహం బయటకు తీస్తుండగా తగిలిన విద్యుత్‌ వైర్లు.. కరెంట్‌ షాక్‌తో ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు!
Jagityal

Edited By:

Updated on: Jun 15, 2025 | 7:35 PM

షెడ్‌లోని వినాయక విగ్రహాలను ఆరబెట్టేందుకు బయటకు తీస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్‌ వైర్లకు తాకి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వెలుగు చూసింది. వివరాళ్లోకి వెలితే..జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జీఎస్ గార్డెన్ సమీపంలోని ఒక షెడ్‌లో గత కొంతకాలంగా వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. అయితే వినాయక చవితి దగ్గరకు వస్తుండడంతో విగ్రహాలను త్వరగా పూర్తి చేయాలని తయారీ దారులు కొంతమంది వలస కార్మికులను రప్పించుకున్నారు. అయితే వీరు విగ్రహాలను తయారు చేసిన తర్వాత వాటిని కొద్ది సేపు ఎండతో అరబెట్టి తర్వాత మళ్లీ షెడ్‌లో పెడుతుంటారు.

ఈ క్రమంలోనే ఆదివారం తయారు చేసిన విగ్రహాలను ఎండలో ఆరబెట్టేందుకు షెడ్‌ నుంచి బయటకు తీస్తుండగా విగ్రహాని పైన ఉన్న 133/11 kV విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో విగ్రహం పట్టుకున్న తొమ్మిదిమంది కార్మికులకు కరెంటు షాక్ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా చల్లాచదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో అల్వాల వినోద్, బంటి సాయి అనే ఇద్దరు యువకులు మృతి చెందగా. మరో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానినికులు వెంటనే విద్యుత్‌ అధికారులు సమాచారం ఇవ్వడంతో వారు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఇందులో ముగ్గురు కోరుట్లలో చికిత్స పొందుతుండగా మిగితావారిని జగిత్యాల అసుపత్రికి తరలించారు.కాగా విషయం తెలుసుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గురైన బాధితులలో ఆరుగురు బీహార్, మహారాష్ట్రకు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..