Hyderabad: గంజాయి మత్తులో స్థానికులు చుక్కలు చూపించిన యువకులు.. చివరికి..!
ఈ ఇద్దరి ఆగడాలతో విసుగు చెందిన భవానీ నగర్ ప్రాంతానికి చెందిన కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గంజాయి మత్తులో స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కనిపించినవారిని వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పలు కేసుల్లో ప్రమేయమున్న ఓ రౌడీ షీటర్ తోపాటు అతని స్నేహితుడిని అరెస్టు చేశారు. ఇద్దరికీ రెండు నెలల జైలు శిక్ష విధించింది కోర్టు.
హైదరాబాద్ మహానగరం పాతబస్తీ యాకుత్‌పురా ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ యూనుస్ అతని స్నేహితుడు నూర్ ఖాన్ బజార్ కు చెందిన సయ్యద్ ఇబ్రహీం గంజాయి సేవిస్తుంటారు. అంతటితో ఆగకుండా మత్తుకు బానిసలై స్థానికులకు ఇబ్బంది కలిగిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. కాగా, వీరిద్దరిపై ఇదివరకే హత్య, హత్యాయత్నం, దోపిడీలు, బలవంతపు వసూళ్ల వంటి పలు ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ ఇద్దరి ఆగడాలతో విసుగు చెందిన భవానీ నగర్ ప్రాంతానికి చెందిన కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గంజాయి సేవించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారన్న సమాచారంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, స్థానిక భవానీ నగర్ పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు వీరిద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఇరువురికీ రెండు నెలల జైలు శిక్ష విధించింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…