దారుణం..20 కోతుల్ని చంపేశారు !

సిద్దిపేట జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దాదాపు 20 కోతుల్ని చంపేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఒకేచోట కుప్పగా పడివున్న కోతుల కళేబారాలను చూసిన స్థానికులు నివ్వేర పోయారు. ఈ ఘటన గజ్వేల్‌ మండలం రిమ్మన గూడలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా రాజీవ్‌ రహదారి పక్కన రిమ్మాన గూడ సమీపంలో 20 వానరాలు మృతి చెంది కనిపించాయి. తెల్లవారు జామున అటుగా వెళ్తున్న రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. గుర్తు తెలియని […]

దారుణం..20 కోతుల్ని చంపేశారు !
Follow us
Anil kumar poka

|

Updated on: Nov 16, 2019 | 9:00 PM

సిద్దిపేట జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దాదాపు 20 కోతుల్ని చంపేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఒకేచోట కుప్పగా పడివున్న కోతుల కళేబారాలను చూసిన స్థానికులు నివ్వేర పోయారు. ఈ ఘటన గజ్వేల్‌ మండలం రిమ్మన గూడలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా రాజీవ్‌ రహదారి పక్కన రిమ్మాన గూడ సమీపంలో 20 వానరాలు మృతి చెంది కనిపించాయి. తెల్లవారు జామున అటుగా వెళ్తున్న రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కోతులకు తినే తిండిలో మత్తు పదార్థాలు కలిపి చంపి ఉంటారని, ఆ తర్వాత తమ గ్రామ సమీపంలో పడేసి వెళ్లినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కోతుల మరణంపై పూర్తి నివేదిక కోసం ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందజేశారు. ఇదిలా ఉంటే, కోతులను చంపటంపై జంతుప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల్ని చంపటం మంచిది కాదని, అది అంజన్నకు ఆగ్రహం తెప్పించే విషయంగా పరిగణిస్తున్నారు.