Basara IIIT: సమస్యలతో సతమతమైన బాసర ట్రిపుల్ ఐటీ గాడిలో పడుతోంది. టీవీ9 వరుస కథనాలతో అలర్ట్ అయిన అధికారులు, ప్రభుత్వం.. విద్యాసంస్థలోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. తాజాగా సోలార్ పవర్ ప్లాంట్ వినియోగంలోకి తీసుకొచ్చారు అధికారులు. అదే స్పీడ్‌తో మిగతా సమస్యలపైనా ఫోకస్ పెట్టారు.
అవును, సమస్యల సుడిగుండం నుంచి బాసర ట్రిపుల్ ఐటీ, ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఒక్కో సమస్యను అధిగమిస్తూ విద్యార్ధుల బంగారు భవిష్యత్ కోసం అడుగులు వేస్తోంది. టీవీ9 వరుస కథనాలతో బాసర ట్రిపుల్ ఐటీలో పవర్ కష్టాలకు చెక్ పడింది. టీవీ9 ప్రసారం చేసిన కథనాలపై స్పందించిన ట్రిపుల్ ఐటీ అధికారులు, క్యాంపస్‌లో ఆగమేఘాల మీద సోలార్ పవర్ ప్లాంట్ వినియోగంలోకి తీసుకొచ్చారు. బడ్జెట్ లేక మరమ్మతులకు నోచుకోక నాలుగేళ్లుగా మూలనపడ్డ సోలార్ పవర్ ప్లాంట్‌ను నెలరోజుల్లో రెడీచేసి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. నెలకు 30వేల యూనిట్స్ ఉత్పత్తి, రోజుకు 600 కిలోవాట్ల విద్యుత్‌ను అందించే సోలార్ పవర్ ప్లాంట్ నాలుగేళ్లుగా మూతపడింది. సోలార్ ప్లాంట్ పరిస్థితిపై వరుస కథనాలు ప్రసారం చేసింది టీవీ9. దాంతో, నెలరోజుల్లో రిపేర్స్ చేపట్టి సోలార్ పవర్ ప్లాంట్ వినియోగంలోకి తీసుకొచ్చారు అధికారులు. మరోవైపు, క్యాంపస్‌లో నెలకొన్న సమస్యలు ఒక్కొక్కటి సర్దుకుంటున్నాయి. విద్యార్ధులంతా స్టడీస్ మీద ఫోకస్ పెట్టేలా చర్యలు చేపడుతున్నారు ఇన్‌ఛార్జ్ వీసీ వెంకటరమణ.
విద్యార్ధుల డిమాండ్స్‌ను దశలవారీగా పరిష్కరిస్తున్నారు అధికారులు. విద్యార్ధులు పెట్టిన 12 డిమాండ్లలో పదింటిని దాదాపు కంప్లీట్‌చేసే దిశగా చర్యలు చేపట్టారు. మిగతా ఇష్యూస్‌ను కొత్త బ్యాచ్ వచ్చేలోగా క్లియర్ చేసేందుకు అడుగులు వేస్తున్నారు. మెయిన్‌గా మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టింది అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..