TSRTC Free Bus: మహాలక్ష్మి పథకానికి మహా స్పందన.. త్వరలో ఆర్టీసీలోకి 2000 కొత్త బస్సులు..!

| Edited By: Balaraju Goud

Dec 20, 2023 | 2:57 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకం కి మహిళలనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. గడచిన 11 రోజుల్లో లక్షల మంది మహిళలు ఫ్రీ జర్నీ చేశారు. అక్కడడక్కడ చిన్న సమస్యలు ఎదురవుతున్నప్పటికీ.. ఆర్టీసీ సిబ్బంది ప్రణాకులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా కష్టపడి పని చేస్తున్నారని ఆర్టీసీ అంటుంది.

TSRTC Free Bus: మహాలక్ష్మి పథకానికి మహా స్పందన.. త్వరలో ఆర్టీసీలోకి 2000 కొత్త బస్సులు..!
Tsrtc
Follow us on

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకం కి మహిళలనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. గడచిన 11 రోజుల్లో లక్షల మంది మహిళలు ఫ్రీ జర్నీ చేశారు. అక్కడడక్కడ చిన్న సమస్యలు ఎదురవుతున్నప్పటికీ.. ఆర్టీసీ సిబ్బంది ప్రణాకులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా కష్టపడి పని చేస్తున్నారని ఆర్టీసీ అంటుంది. పథకం అమలులో ఎప్పటినుంచి ఇప్పటివరకు ఎంతమంది మహిళలు జర్నీ చేశారు. ఎన్ని జీరో టికెట్లు ఇష్యూ చేశారు. అధికారికంగా లెక్కలు చెప్పారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

డిసెంబర్ 9 నుండి మహిళల ఫ్రీ జర్నీ కోసం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 15వ తేదీ నుండి జీరో టికెట్ తీసుకుని ప్రయాణం చేయాలని నిబంధన పెట్టారు ఆర్టీసీ అధికారులు. అయితే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ జర్నీ వల్ల ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరిగిందని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తెలిపారు. ఫ్రీ బస్ స్కీమ్ తో 11 రోజుల్లో 3కోట్ల మహిళలు జర్నీ చేశారు. అంటే దాదాపు రోజు 30లక్షల మంది మహిళలు ప్రయాణించినట్లు వెల్లడించారు. దీంతో ఆర్టీసీ బస్సులో అక్యూపేన్సి 69 శాతం నుండి 88 శాతానికి పెరిగిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

ఈ 11 రోజుల్లో 110 కోట్ల రూపాయల జీరో టికెట్స్ ఇష్యూ చేశామని ఆర్టీసీ ఎండీ సజ్జానార్ తెలిపారు. ఈ సబ్సిడీ భర్తీ కోసం నెలకి 250 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ పథకం కోసం ప్రభుత్వం నీ అడుగుతున్నామని అన్నారు. బస్సులో ప్రయాణించే మహిళలు తమ ఒరిజినల్ గుర్తింపు కార్డ్ ఏదైనా తపనిసరి చూపించాల్సి ఉంటుంది. జిరాక్స్, ఫోన్లలో పిక్ చూపించడం కుదరదంటున్నారు ఆర్టీసీ అధికారులు. బస్సుల్లో పెరిగిన రద్దీ వల్ల ప్రయాణ సమయం పెరిగిందంటున్నారు సిబ్బంది. దీంతో పాటు గ్రామాలకు బస్సుల కనెక్టివిటీ పెంచుతామని, అప్పటి వరకు ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని కోరుతున్నారు అధికారులు. బస్సులో విద్యార్థులు, మగవారు ప్రమాదకర ప్రయాణం చేయడం మంచిది కాదంటున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. కొన్ని చోట్ల ఫ్రీ వద్దని వినతులు వచ్చాయని, అలాంటి వారు బస్ పాస్ తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 9,000 బస్సులు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. అక్యుపెన్సీ రేషియో పెరిగింది. కాబట్టి బస్తుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని ఎండీ సజ్జనార్ వివరించారు. వచ్చే ఐదు నెలలో 2వేల బస్సులు అందుబాటులోకి రానున్నాయని, ఇందులో వేయి డీజిల్, వేయి ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. అప్పటివరకు ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని, ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాల బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…