TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్యకు చెక్‌

|

Jul 12, 2024 | 2:24 PM

దీంతో ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యగా మారుతోంది. మరీముఖ్యంగా తెలంగాణలో మహా లక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పురుషులకు చిల్లర సమస్య మరింత ఎక్కువైంది. ఈ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పల్లె బస్సులతో పాటు, సిటీ బస్సుల్లోనూ నగదు...

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్యకు చెక్‌
Tgrtc
Follow us on

ప్రస్తుతం ఎక్కడ చూసినా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నగదు రహిత లావాదేవీలకు ఫుల్ డిమాండ్ ఉంది. యూపీఐ పేమెంట్స్‌ యాప్స్ అందుబాటులోకి రావడంతో టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షోరూమ్‌ల వరకు అన్నిచోట డిజిటల్‌ చెల్లింపులు కామన్‌గా మారాయి. అయితే బస్సుల్లో మాత్రం ఇలాంటి సేవలు ఇప్పటి వరకు అందుబాటులో లేవనే చెప్పాలి.

దీంతో ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యగా మారుతోంది. మరీముఖ్యంగా తెలంగాణలో మహా లక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పురుషులకు చిల్లర సమస్య మరింత ఎక్కువైంది. ఈ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పల్లె బస్సులతో పాటు, సిటీ బస్సుల్లోనూ నగదు రహిత డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆగస్టు నాటికి సిటీ సర్వీసుల్లో, సెప్టెంబర్‌ నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ సేవలను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే కండక్టర్లకు 10 వేల ఐ-టిమ్స్‌ను (ఇంటెలిజెంట్‌ టికెట్ ఇష్యూ మిషన్‌) అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో ప్రయాణికులు స్కాన్‌ చేసిన తమ యూపీఐ యాప్స్‌తో పేమెంట్ చేయొచ్చు. కేవలం క్యూఆర్ కోడ్‌ స్కాన్‌ మాత్రమే కాకుండా కొత్తగా తీసుకొస్తున్న ఐటిమ్స్‌తో డెబిట్ కార్డ్ ద్వారా కూడా పేమెంట్స్‌ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆధార్‌ కార్డ్ చూసి జీరో టికెట్‌ జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో మహిళలకు స్మార్ట్ కార్డ్‌లను అందించనున్నారు. ఇకపై ఈ కార్డులను స్వైప్‌ చేస్తే సరిపోతుంది. ఇందుకోసం కూడా ఐటిమ్స్‌లో వెసులుబాటును కల్పించనున్నారు. స్మార్ట్‌ కార్డులను స్వైప్‌ చేసి జీరో టికెట్‌ ఇవ్వనున్నారు.

ఇక ఈ మిషిన్స్‌తో ప్రయాణికులకు మెరుగైన సదుపాయం కల్పించడంతో పాటు.. బస్సు కదలికలు, సిబ్బంది పనితీరు, ఆదాయం తదితర సమాచారమంతా అధికారులు సులభంగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులో భాగంగా బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్‌ సిటీ బస్సులకు ఐ-టిమ్స్‌ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..