AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: రంజాన్‌ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్‌.. ఆ ఛార్జీలపై 25 శాతం రాయితీ.. పూర్తి వివరాలివే..

VC Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వినూత్న ఆఫర్లు, పథకాలతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వీసీ సజ్జనార్‌ (VC Sajjanar).

TSRTC: రంజాన్‌ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్‌.. ఆ ఛార్జీలపై 25 శాతం రాయితీ.. పూర్తి వివరాలివే..
Sajjanar
Basha Shek
|

Updated on: Apr 25, 2022 | 11:38 AM

Share

VC Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వినూత్న ఆఫర్లు, పథకాలతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు వీసీ సజ్జనార్‌ (VC Sajjanar). వివిధ పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసుల ఏర్పాటుచేస్తున్నారు.  అదే సమయంలో ఆర్టీసీకి ఆదాయం తెచ్చే సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా పండగలు, ప్రత్యేక దినాల్లో ప్రత్యేక ఆఫర్లు ప్రవేశ పెడుతున్నారు. తాజాగా పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా ప్రయాణికులకు మరో బంఫరాఫర్‌ ప్రకటించారు సజ్జనార్‌. ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ ఛార్జీలపై 25 శాతం రాయితీ అందించనున్నట్లు ఆయన తెలిపారు. రంజాన్‌ పండగ (మే3) వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. 5 కేజీల లగేజీ వరకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. పూర్తి వివరాల కోసం 040-300102829, 68153333 నంబర్లను సంప్రదించాలని ఎండీ సూచించారు.

ఆర్టీసీతో కనెక్ట్‌ అవ్వండి..

కాగా ఈ ఆఫర్‌ వివరాలను తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు సజ్జనార్‌. ‘ పవిత్ర రంజాన్‌ పండగ సందర్భంగా మీ ప్రియమైన వారితో కనెక్ట్‌ అవ్వండి. వారికి ఇష్టమైన దుస్తులు, బహుమతులు, స్వీట్లు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌, సేమియా, ఖర్జూరాలు తదితర వస్తువులు ఆర్టీసీ ద్వారా పంపించండి. హ్యాపీ రంజాన్‌’ అని అందులో రాసుకొచ్చారు.

Also Read: Train Travel: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా..? పొరపాటున ఈ పనులు చేస్తే నేరమే..!

Virat Kohli: విరాట్‌ కోహ్లీ ఫామ్‌ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.. RCB హెడ్‌ కోచ్‌ సంజయ్ బంగర్..

Moringa Leaf Benefits: మునగ ఆకులు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..