TSRTC New Year Gift: ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌.. న్యూ ఇయర్‌ సందర్భంగా చిన్నారులకు ఉచిత ప్రయాణం..

TSRTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి మార్పు స్పష్టంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికుల సమస్యలపై సజ్జనార్ స్వయంగా స్పందిస్తూ.. వెంటనే చర్యలు

TSRTC New Year Gift: ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌.. న్యూ ఇయర్‌ సందర్భంగా చిన్నారులకు ఉచిత ప్రయాణం..
Tsrtc

Updated on: Dec 30, 2021 | 9:22 PM

TSRTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి మార్పు స్పష్టంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికుల సమస్యలపై సజ్జనార్ స్వయంగా స్పందిస్తూ.. వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు పలు సంస్కరణలకు వీసీ సజ్జనార్ నాంది పలికారు. ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఆర్టీసీ బ‌స్సుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు, ప్రయాణికులను ఆక‌ట్టుకునేందుకు సజ్జనార్‌.. ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు నాంది పలుకుతున్నారు. తాజాగా సజ్జనార్ మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని చిన్నారులకు చిరు కానుకను ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా 12 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు గురువారం తెలిపారు.

న్యూ ఇయర్‌ తొలి రోజున పిల్లలకు టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించే 12 ఏండ్లలోపు చిన్నారులకు జనవరి ఒకటిన ఒక్క రోజు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు సజ్జనార్‌ తెలిపారు. ఈ సదుపాయం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సుల్లో వర్తిస్తుందన్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఈ ఏడాది బాలల దినోత్సవం సందర్భంగా కూడా 15 ఏళ్లలోపు చిన్నారులకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆర్టీసీ వీలు కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయం తీసుకుంటూ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.

Also Read:

Covaxin Vaccine: పిల్లలపై ప్రభావవంతంగా కోవాగ్జిన్ టీకా.. తుది దశ ఫలితాలు వెల్లడించిన భారత్ బయోటెక్..

Soumya Swaminathan: ఓమిక్రాన్ కట్టడికి అదొక్కటే మార్గం.. కీలక ప్రకటన చేసిన WHO చీఫ్ సైంటిస్ట్!