Telangana: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు రౌండప్.. తక్షణమే అమల్లోకి

|

Mar 18, 2022 | 12:26 PM

TSRTCలో టికెట్ల ధరల్లో స్పల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. పల్లెవెలుగు టికెట్ల చార్జీలు రౌండప్‌ చేసింది ఆర్టీసీ.

Telangana: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు రౌండప్.. తక్షణమే అమల్లోకి
Tsrtc
Follow us on

TSRTC టికెట్ల ధరల్లో స్పల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. పల్లెవెలుగు టికెట్ల చార్జీలు రౌండప్‌ చేసింది ఆర్టీసీ. చిల్లర సమస్య లేకుండా ధరలు రౌండప్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.12 ఛార్జీ ఉన్న చోట టికెట్‌ ధర రూ.10గా రౌండప్‌ చేసింది ఆర్టీసీ. రూ.13, రూ.14 ఉన్న టికెట్‌ ఛార్జీని రూ.15గా ఫైనల్ చేశారు. 80 కిలోమీటర్ల దూరానికి రూ.67 ఉన్న ఛార్జీని రూ.65గా ఆర్టీసీ నిర్ధారించింది. టోల్‌ప్లాజాల వద్ద ఆర్డినరీ బస్సులో అయితే రూ.1, హైటెక్, ఏసీ బస్సులకు రూ.2 అదనంగా ప్రయాణీకుల నుంచి వసూలు చేయనున్నారు.  సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని TSRTC ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ సజ్జనార్ తన మార్క్ వేలో ముందకు వెళ్తున్నారు. ఓవైపు ఆఫర్లు, ఫ్యాకేజీలతో ప్రయాణికులను ఆకర్షిస్తూ.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. టీఎస్‌ఆర్టీసీ ముందుకు తీసుకెళ్తే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read:  వలలో చిక్కుకున్న 2 తలల పాము.. అది ఇంట్లో ఉంటే కుబేరులు అవుతారా..? ఇదిగో క్లారిటీ