TSRTC: టీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్.. అయ్యప్ప భక్తుల కోసం స్పెషల్ బస్సులు.. వారికి మాత్రం ఫ్రీ..

|

Dec 10, 2022 | 8:57 PM

ఇప్పటికే పలు రకాల రాయితీలు, ఆఫర్లతో ప్రయాణికుల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్న టీఎస్ఆర్టీసీ మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం మాల ధారణ అధికమైంది. ప్రజలు తమకు నచ్చిన దేవుళ్లకు...

TSRTC: టీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్.. అయ్యప్ప భక్తుల కోసం స్పెషల్ బస్సులు.. వారికి మాత్రం ఫ్రీ..
Tsrtc
Follow us on

ఇప్పటికే పలు రకాల రాయితీలు, ఆఫర్లతో ప్రయాణికుల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్న టీఎస్ఆర్టీసీ మరో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం మాల ధారణ అధికమైంది. ప్రజలు తమకు నచ్చిన దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటూ మాలలు ధరిస్తుంటారు. వాటిలో ముఖ్యంగా అయ్యప్ప మాల గురించి చెప్పుకోవాలి. ఈ మాల వేసుకునే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. మండల రోజులు పూజలు చేసిన తర్వాత అయ్యప్ప సన్నిధానం అయిన శబరిమలలో ఇరుముడులు సమర్పిస్తుంటారు. దీంతో అక్కడికి వెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. అవి కూడా సరిపోవడం లేదు. దీంతో ఆర్టీసీ మరో అడుగు ముందుకు వేసి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయితీగా వస్తోంది. అయ్యప్ప స్వామి భక్తులు ప్రైవేటు సంస్థల బస్సులను ఆశ్రయించి నష్టపోకుండా, రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ధన్ ప్రక‌టించారు.

ఈ బస్సుల్లో ఎలాంటి డిపాజిట్ లేకుండా 10 శాతం రాయితీపై సూప‌ర్ ల‌గ్జరీ, డీల‌క్స్, ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు వంట వారికి, 12 సంవ‌త్సరాలు లోబ‌డిన మ‌ణికంఠ స్వాములు, ఒక అటెండ‌ర్‌కు ఉచితంగా ప్రయాణం క‌ల్పిస్తామ‌న్నారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి కూడా ప్రయాణం ఉచితంగా ఇస్తామ‌న్నారు. ఈ ప్రత్యేక బ‌స్సుల‌ను అయ్యప్ప స్వాములు కోరుకున్న ప్రదేశం నుంచి ద‌ర్శించ‌వ‌ల‌సిన పుణ్యక్షేత్రాల వ‌ర‌కు న‌డపనున్నారు. బ‌స్సుల్లో ముందస్తు సీట్ రిజర్వేషన్ కోసం శబరిమల యాత్రకు కావలసిన ఆర్టీసీ బస్ అద్దె బుకింగ్‌ల‌ కోసం www.tsrtconline.in సంప్రదించాల‌ని సూచించారు.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం – శుభప్రదం అనే నినాదాన్ని నిజం చేస్తూ సురక్షిత ప్రయాణాలు అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్వాములు ప్రమాదాల బారిన పడుకుండా.. వారిని క్షేమగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్ఆర్టీసీ ఎప్పుడూ ముందుగానే ఉంటుందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..