TSPSC Honey Trap: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ సూత్రధారి అరెస్ట్‌..! యువతి వలలో చిక్కుకుని..పేపర్‌ లీక్‌ చేసి..

|

Mar 12, 2023 | 1:27 PM

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కరి కోసం వేలాది మంది జీవితాలతో చెలగాటం ఆడాడు ఓ ఉద్యోగి. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్ లీక్‌ అంశంలో..

TSPSC Honey Trap: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ సూత్రధారి అరెస్ట్‌..! యువతి వలలో చిక్కుకుని..పేపర్‌ లీక్‌ చేసి..
TSPSC Honey Trap
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కరి కోసం వేలాది మంది జీవితాలతో చెలగాటం ఆడాడు ఓ ఉద్యోగి. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్ లీక్‌ అంశంలో హనీ ట్రాప్‌ కారణమన్న విషయం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ సూత్రధారి ఉద్యోగి ప్రవీణ్‌ కుమార్‌ కారణమని పోలీసులు గుర్తించారు. సిస్టమ్స్‌ని హ్యాక్‌ చేసి, ప్రవీణ్‌కుమార్‌ పేపర్‌ లీక్‌ చేసినట్టు తేల్చారు. అయితే ఈ స్కాంలో పేపర్‌ లీక్‌ హనీ ట్రాప్‌ కీలకంగా మారింది. అదే ఇప్పుడు సర్వత్రా కలకలం రేపుతోంది. ఓ యువతి కోసం ఉద్యోగి ప్రవీణ్‌ ఈ దారుణానికి ఒడిగట్టాడన్న విషయం సర్వత్రా హల్‌చల్‌ చేస్తోంది. తరచూ ప్రవీణ్‌ని కలిసేందుకు వచ్చే ఓ యువతి కోసం ఇదంతా జరిగిందన్న విషయం సంచలనం రేకెత్తిస్తోంది. యువతి కోసం గుట్టు చప్పుడు కాకుండా టౌన్‌ప్లానింగ్‌ పేపర్ని లీక్ చేశాడు ప్రవీణ్. తరచూ ప్రవీణ్‌ వద్దకు ఓ యువతి వస్తూ ఉండేదని, ట్రాప్‌ చేసి ఆ యువతి ప్రవీణ్‌కు దగ్గరైనట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఆ యువతి వలలో చిక్కిన ప్రవీణ్‌ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం ప్రవీణ్‌ కుమార్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రవీణ్‌ పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఎందుకు చేశాడు..? తెరవెనుక అసలు కథ ఏమిటన్న విషయాన్ని తేల్చేపనిలో పోలీసులు ఉన్నారు. కాగా సిస్టమ్స్ హ్యాక్ చేసి పేపర్‌ లీక్‌ చేయడంతో… టీఎస్పీఎస్సీ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. దీంతో వేలాది మంది జీవితాలతో చెలగాటమాడిందెవరన్న దాన్ని తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఒక్క ప్రవీణేనా…ఈ స్కాంకి కారణమైన హనీ ట్రాప్‌లో ఇంకా ఎవరెవరున్నారన్న విషయం తేల్చేపనిలో పోలీసులు ఉన్నారు. పేపర్‌ ఆ యువతి నుంచి ఇంకా ఎవరెవరికి చేరిందనే దానిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంలో ఏడుగురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీలో సంచలనంగా మారిన హనీట్రాప్‌ వ్యవహారం ఇప్పుడు యావత్‌ తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు నిరుద్యోగులు ఏం జరుగుతుందో తెలియక సందిగ్ధంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.