TSPSC Group -4 Applications: అభ్యర్థులకు అలర్ట్.. ఆలస్యంగా ప్రారంభమైన గ్రూప్ – 4 దరఖాస్తులు.. తగ్గిన పోస్టులు..

|

Dec 31, 2022 | 6:36 AM

నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ - 4 ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. నిన్న ( డిసెంబర్ 30 ) న ప్రారంభం కావాల్సిన దరఖాస్తులు.. చాలా ఆలస్యంగా రాత్రి 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి....

TSPSC Group -4 Applications: అభ్యర్థులకు అలర్ట్.. ఆలస్యంగా ప్రారంభమైన గ్రూప్ - 4 దరఖాస్తులు.. తగ్గిన పోస్టులు..
TSPSC Application
Follow us on

నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ – 4 ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. నిన్న ( డిసెంబర్ 30 ) న ప్రారంభం కావాల్సిన దరఖాస్తులు.. చాలా ఆలస్యంగా రాత్రి 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. అప్లికేషన్ చేసే సమయంలో టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కమిషన్ అధికారులు వెల్లడించారు. దీంతో దరఖాస్తుల ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ప్రక్రియలన్నీ సకాలంలో పూర్తయ్యేలా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి పర్యవేక్షించారు. గ్రూప్‌ 4 కు తొలుత 9,168 పోస్టులతో ప్రకటన వెలువడింది. అయితే తాజాగా రూపొందించిన వెబ్‌సైట్‌లో సమగ్ర ప్రకటనలో 8,039 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అంటే 1129 తగ్గడం గమనార్హం.

కాగా.. డిసెంబర్ 23 నుంచి ప్రారంభం కావాల్సిన అప్లికేషన్లు వాయిదా పడ్డాయి. శుక్రవారం రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చాయి. అన్ని డిపార్ట్​మెంట్ల నుంచి పూర్తి స్థాయి సమాచారం రాకపోవడంతో టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని 97 హెచ్ఓడీల పరిధిలో 9,168 పోస్టుల భర్తీని టీఎస్పీఎస్సీకి అప్పగిస్తూ నవంబర్ 25న ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. దీంట్లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6859, వార్డు ఆఫీసర్ పోస్టులు 1862, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429 , జూనియర్ ఆడిటర్ పోస్టులు 18 ఉన్నాయి.

మరోవైపు.. తెలంగాణలో 783 గ్రూప్‌-2 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ గురువారం (డిసెంబర్‌ 29) నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు జనవరి 18 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. డిగ్రీ అర్హత ఉన్న వారెవరైనా గ్రూప్ 2 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కాగా ఇప్పటికే 503 గ్రూప్‌-1 పోస్టులకు, 9,168 గ్రూప్‌-4 పోస్టుల టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.