TSPSC Chairman: తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా డా. బి. జనార్ధన్ రెడ్డి.. నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్

|

May 19, 2021 | 11:42 AM

TSPSC Chairman: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అదేవిధంగా సభ్యులను బుధవారం, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు.

TSPSC Chairman: తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా డా. బి. జనార్ధన్ రెడ్డి.. నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్
TSPSC
Follow us on

TSPSC Chairman: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అదేవిధంగా సభ్యులను బుధవారం, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనల మేరకు గవర్నర్ దీనిని ఆమోదించారు.ప్రస్తుతం వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న డా. బి. జనార్ధన్ రెడ్డి, ఐఎఎస్ ను నియమించారు. అదేవిధంగా సభ్యులుగా మావత్ ధన్ సింగ్, ప్రొ. బి. లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్రా ఆనంద్ తనోబా, కారం రవీందర్ రెడ్డి, ఆరవెల్లి చంద్రశేఖర్ రావు, డాక్టర్ ఆర్. సత్యనారాయణ లను ముఖ్యమంత్రి కేసీఆర్ నియామకం చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం కేసీఆర్ఆదేశించారు.

నాలుగు వారాల్లోపు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులను నియమించాలని ఇటీవల హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. త్వరలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులను నియమించింది. దీంతో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది. ఇది నిరుద్యోగులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు.

Tspsc List

Also Read: Corona: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 3982 పాజిటివ్ కేసులు, 27 మరణాలు…

Telangana joins Ayushman Bharat: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆయుష్మాన్ భారత్‌లో చేరాలని నిర్ణయం.. కేంద్రంతో ఒప్పందం